Advertisement
ఈ ఆగస్టు 11న తిరుమలలో ఆరు సంవత్సరాల బాలిక లక్షిత చిరుత దాడికి గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులతో కలసి ఆగస్టు 11 నా శుక్రవారం రాత్రి అలిపిరి కాలిబాట వెంబడి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న లక్షితను చిరుతపులి కొట్టి చంపింది. ఈ ఘటన తర్వాత కాలినడకన వెళ్లడానికి భక్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే పాదచారుల మార్గంలో చిరుతపులి దాడి చేయడంతో మరణించిన ఘటన ఇదే తొలిసారి. ఇక ఈ ఏడాది జూన్ నెలలో చిరుత దాడికి గురై ఐదేళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత బోనులు ఏర్పాటు చేసి రెండు చిరుతలను పట్టుకున్నారు టీటీడీ అధికారులు. అసలు మెట్ల మార్గంలో తరచూ చిరుత పులులు ఎందుకు వస్తుంటాయి..? భక్తుల భద్రత కోసం టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
నడకదారిలో వెళ్లే భక్తులకు పాదాల మండపం నుంచి కొంత దూరం వెళితే రాజగోపురం వస్తుంది. టిటిడి చెకింగ్ పాయింట్ దాటుకొని ముందుకు వెళితే గాలిగోపురం వస్తుంది. ఇక ఈ దారి పొడుగునా తినుబండారాలు లభిస్తాయి. ఇక్కడ ఉన్న దుకాణాలు కూడా క్రూర మృగాలు సంచారానికి కారణమని జంతువుల జీవన విధానం గురించి నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహార పదార్థాల వ్యర్ధాలు అడవుల్లో వేయడం వలన చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏడవ మైలురాయి వద్ద నుంచి ప్రారంభమైన ప్రాంతమంతా కూడా డేంజర్ జోన్‌గా టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ డేంజర్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో రెండు మైళ్ళ దూరం వరకు దట్టమైన అడవి ఉంటుంది. ఇంకా ఈ ప్రాంతంలోనే లక్షితపై చిరుత దాడి చేసింది.
దాడి తర్వాత భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న భద్రతా చర్యలు..?
Advertisement
జంతువులకు అడవి స్వేచ్ఛ నిలయం లాంటిది. కాబట్టి వాటికి ఆటంకం కలగకుండా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నడక మార్గంలో వారి ప్రయాణం సాఫీగా సాగడానికి టీటీడీ కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. కాలిబాటలో వెళ్లే ప్రతి భక్తుడికి ఆత్మరక్షణ కోసం చెక్క కర్రను అందజేస్తారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో అనుమతించబడతారు. భక్తుల భద్రత కోసం అడవి జంతువుల దాడులను అరికట్టడంలో నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమిస్తామన్నారు. సెక్యూరిటీ గార్డును ఇవ్వడం ద్వారా మాత్రమే భక్తులను సమూహాలుగా అనుమతిస్తారు.
జంతువులకు ఆహార పదార్థాలను అందించే ట్రస్ట్ నిషేధించిందని, అలాంటి ఆహార పదార్థాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫుట్‌పాత్ మార్గాల్లోని హోటళ్ల యజమానులు ఆహార వ్యర్థాలను వేయవద్దని టీటీడీ సూచించింది. అడవి అనేది జంతువుల సొంతం కాబట్టి వాటి మార్గానికి భక్తులు అడ్డు రాకుండా రెండు మైళ్ళ వరకు ఉన్న డేంజర్ జోన్‌లో కంచులతో కూడిన బ్రిడ్జ్‌లను నిపుణుల సహాయంతో ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
మరణించిన వారి అస్థికలను “గంగా నది” లో కలపడానికి గల వెనుక ఉన్న అంతర్యం ఏమిటో తెలుసా…?
కోడలు అత్తకి రాసిన ఉత్తరం ! ఈ రూల్స్ పెట్టకండి అత్తయ్య అంటూ … చూస్తే నవ్వు ఆపుకోలేరు
ISRO Work Life: ఇస్రో వర్క్ లైఫ్ గురించి ఎవ్వరికి తెలియని టాప్ 10 విషయాలు!