Advertisement
చివరివరకు రసవత్తరంగా సాగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఫైనల్స్ కి వచ్చేసరికి భారత్ తడపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ టీం తడబడే సరికి ఆ ఒత్తిడి బౌలర్లపై కూడా పడింది. బౌలర్లు చేతులెత్తేసరికి విజయం ఆస్ట్రేలియా ని వరించింది. ఒక్కసారిగా అందరూ డీలా పడిపోయారు. చివరి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడిన ఇండియానే కచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని అందరు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా తారుమారు అయ్యింది. టివిల ముందు కూర్చుని చూసే మనకే ఇలా ఉంటె.. ఇన్ని ఆటలు పట్టుదలగా ఆడిన ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించలేము.
Advertisement
ఆట ముగిసిన తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో ఏమి జరిగింది? అక్కడ స్టాఫ్ ఎలా రియాక్ట్ అయ్యారు? టీం ఇండియా ఆటగాళ్ల రియాక్షన్ అనేది ఏంటో చెపుతూ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ మ్యాచ్ ఓడిపోగానే తీవ్ర నిరాశకి గురి అయ్యాడని తెలిపారు. జట్టులోని ప్రతి ఆటగాడు కన్నీళ్ళలో మునిగిపోయాడని, టీం ఇండియా హెడ్ కోచ్ గా ఆ పరిస్థితిని నేను చూడలేకపోయానని ద్రావిడ్ అన్నారు. ఓటమి వచ్చిందని అక్కడితో ఆగిపోకూడదని, తిరిగి సూర్యోదయాన్ని ఆహ్వానించాలని అన్నారు. ఆటగాళ్లకు ఎత్తుపల్లాలు సహజమేనని అన్నారు.
Advertisement
ఇక హెడ్ కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం కూడా ముగుస్తోంది. దీనితో పదవిలో కొనసాగుతారా? లేదా అని ఓ విలేఖరి అడగ్గా.. ఈ విషయం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదని.. ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేనని ద్రావిడ్ చెప్పుకొచ్చారు. హెడ్ కోచ్ గా ద్రావిడ్ పదవీకాలాన్ని పొడిగించాలా? లేదా? అన్న విషయం గురించి బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ చర్చల తరువాత ద్రావిడ్ కొనసాగుతారా, లేదా అన్న సంగతి తెలుస్తుంది.
Read More:
Kotabommali Movie Review: కోటబొమ్మాళి మూవీ రివ్యూ.. శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టా..?
ఈ ఐదు రాశుల స్త్రీలు భర్తకి అదృష్ట దేవతలట.. వారిలో మీరున్నారేమో చూడండి!