Advertisement
ప్రస్తుతం ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, ప్రేమ విఫలం చెందితే చనిపోవడం ఇలాంటివి యువతలో సర్వసాధారణం అయిపోయింది. తాజాగా జ్యోతి అనే మహిళ అకస్మాత్తుగా మరణించింది. ఆమె మరణానికి కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిధిలోని గొల్లవాని తిప్ప గ్రామంలో పోతుల జ్యోతి(22) నివాసం ఉండేది. మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత జ్యోతి భర్తతో ఉండడం ఇష్టం లేక అతనికి విడాకులు ఇచ్చింది. చాలా కాలం వరకు తల్లిదండ్రులతో గడిపింది. తన సొంతూరికి చెందిన శ్యామ్ అనే యువకుడిత జ్యోతి ప్రేమ వ్యవహారం నడిపినట్టు సమాచారం.
Advertisement
ఇటీవల జ్యోతి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు వెళ్ళింది. ప్రియురాలు వెళ్లిన కొన్ని రోజులకే శ్యామ్ కూడా నగరానికి వెళ్ళాడు. ఇద్దరు వేరువేరు సంస్థలో ఉద్యోగాలు చేస్తూ హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. శ్యామ్ స్నేహితుడైన వంశీది త్వరలో నిశ్చితార్థం ఉండడంతో కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లో ఉన్న తన ఇంటికి తాళం వేసి ఊరెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్.. వంశీకి ఫోన్ చేసి అతని రూమ్ కు వెళ్ళాడు. తన వెంట ప్రియురాలు జ్యోతిని కూడా తీసుకెళ్లాడు. అయితే జ్యోతి, శ్యామ్ పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ, పెద్దల కట్టుబాట్ల కారణంగా వీరు పెళ్లి చేసుకోలేదు. బతికుండగా కలిసి ఉండలేం అనుకున్నారో ఏమో కానీ.. చివరికి అదే రోజు రాత్రి ఆ**త్య చేసుకోవాలని అనుకున్నారు.
Advertisement
వీరు అనుకున్నట్టే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. జ్యోతి సోదరుడు మరుసటి రోజు ఆమెకి ఫోన్ చేశాడు. ఎంతకూ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఉంటున్న హాస్టల్ కు వెళ్లి చూశాడు. అక్కడ కనిపించలేదు. ఇక వెంటనే కేపీహెచ్ 7వ ఫేజ్ లో ఉంటున్న వంశీ ఇంటికి వెళ్లి చూడగా.. గదిలో శ్యామ్ , జ్యోతి చనిపోయి విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సీన్ చూసి ఆమె సోదరుడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి మరణానికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
అంత్యక్రియల సమయంలో కుండలో నీరు పోసి రంద్రాలు పెట్టి పగలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా ?