Advertisement
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా బిస్కెట్స్ తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పిల్లలు మారం చేసినప్పుడు వాళ్లకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. అయితే బిస్కెట్లలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో మీరు పార్లే-జీ బిస్కెట్స్ ని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. ఈ బిస్కెట్ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్ గా ఉంది. పార్లేజీ బిస్కెట్ అంటే అదొక పేదవాళ్ళ బిస్కెట్. తక్కువ ధరకే ఆ బిస్కెట్ లభించడం వల్ల చాలామంది ఆ బిస్కెట్లను కొంటుంటారు. ప్రస్తుతం మార్కెట్లోకి అనేక రకాల బిస్కెట్లు వచ్చాయి. అందుకే పార్లేజీ బిస్కెట్ కు డిమాండ్ తగ్గిపోయింది.
Advertisement
Advertisement
అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ కు పార్లే – జీ అని పేరు ఎందుకు పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు? అనేది చాలామందికి తెలియని విషయం. ఈ బిస్కెట్ల మొట్టమొదటి ప్లాంట్ 1929 లో ముంబైలోని విలే పార్లే లో ప్రారంభమైంది. పార్లేజీ బిస్కెట్లను గ్లూకోస్ తో తయారు చేస్తున్నారు. మొదట కేవలం 12 మంది సిబ్బంది మాత్రమే ఇందులో పనిచేసేవారు. అయితే పార్లే – జీ బిస్కిట్లు తయారుచేసింది మాత్రం 1938 నుంచి. అప్పుడు ఈ బిస్కెట్ కి పార్లేజీ – గ్లూకో అని పేరు పెట్టారు. 80వ దశకం ప్రారంభమయ్యే వరకు దీని పేరు అలాగే ఉంది. 1981 లో కంపెనీ పార్లెజి గ్లూకోను కేవలం G గా మార్చింది. G అంటే గ్లూకోస్. అయితే ఈ బిస్కెట్ 81 దశకంలో పిల్లలనుండి పెద్దవాళ్ల వరకు ప్రచుర్యం పొందింది.
పిల్లలకు నచ్చడంతో ఈ కంపెనీ జి పదాన్ని జీనియస్ గా మార్చింది. అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరు? ఆ చిన్నారి పేరు ఏంటి అనే దానిపై పలు రకాల వాదనలు ఉన్నాయి. ఈ చిన్నారి నీరు దేశ్పాండే, సుధా మూర్తి, గుంజన్ గుండానియా అని ముఖ్యంగా మూడు పేర్లు వినిపించాయి. నీరు దేశ్ పాండే 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఫోటో తీశారని.. ఆమె పేరు బలంగా వినపడింది. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ కంపెనీ ఒక కీలక ప్రకటన చేసింది. ప్యాకెట్ పై ఉన్న చిన్నారి ఎవరు కాదని.. అది కేవలం ఊహాగానం మాత్రమేనని తెలిపింది. ఎవరెస్టు క్రియేటివ్ ఏజెన్సీ వారు ఈ చిత్రాన్ని క్రియేట్ చేశారని కంపెనీ వెల్లడించింది.
Read also: పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్!