Advertisement
మనదేశంలో ఎంతోమంది గొప్పవాళ్లు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల స్థానం వేరు. ఒకరు ఆకలిని తీర్చే అన్నదాత, అయితే మరొకరు దేశ ప్రజల కోసం బార్డర్ లో కాపలా కాసే సైనికుడు. మనం ఇంత స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించగలుగుతున్నామంటే సాధారణ విషయం కాదు. అందుకు మన భారత సైన్యం ప్రధాన కారణం అవుతుంది. అయితే అలాంటి సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ప్రతిరోజు ఉదయం 3:30 లేదా 4 గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది. 4 నుంచి 5 వరకు కాలకృత్యాలను తీర్చుకోవడంతోపాటు, వారుంటున్న చోటును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 5:30 నుంచి 6 గంటల సమయంలో అందరూ గ్రౌండ్ కి వచ్చి రిపోర్టు చేయవలసి ఉంటుంది. 6 నుంచి 7:30 వరకు సైనికులతో పిటి (ఫిజికల్ టెస్ట్, డ్రిల్) చేయిస్తారు. ఈ పీటీ ఒక్కో బ్యాచ్ కి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు క్లాసులు జరుగుతాయి. మళ్లీ 2 గంటల సమయంలో గ్రౌండ్ లోకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
Advertisement
తర్వాత 7:30 నుంచి 8:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. రాత్రి 8:30 నుంచి 9 వరకు డిన్నర్ టైం. భోజనం పూర్తి చేసుకున్న తర్వాత అందరూ 9 నుంచి 10 గంటల వరకు ఫ్రీ టైం ఇస్తారు. ఈ టైంలో వారికి నచ్చిన పనులు చేసుకోవచ్చు. రాత్రి 10 గంటలకు లైట్స్ అనేవి వాటంత అవే ఆఫ్ అయిపోతాయి. తర్వాత అందరూ పడుకోవాల్సిందే. ఇక సెలవుల విషయానికొస్తే సంవత్సరానికి 80 రోజులు లేదా 3 నెలల పాటు సెలవులనేవి ఇస్తారు. 3 నెలలు వారి కుటుంబాలతో గడిపాక తిరిగి ఇక్కడికి చేరుకుంటారు.
ఆహారం:
ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు, బట్టర్, జామ్, కార్న్ ఫ్లెక్స్, పాలు, టీ లేదా కాఫీ, వెజిటబుల్ కట్ లెట్స్ అనేవి ఇస్తారు. వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ అనే దానిని పరిగణలోకి తీసుకొని బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక లంచ్ లో వెజిటేబుల్స్, చికెన్ లేదా మటన్ లేదా ఫిష్, రోటి అలాగే సలాడ్ ఇస్తారు. సాయంత్రం రిఫ్రెష్ అయ్యే టైం లో టీ, కాఫీ, పాలు అనేవి ఇస్తారు. ఇక డిన్నర్ లో యధావిధిగా లంచ్ లో పెట్టిన మెనూ ప్రకారం అన్ని అందుబాటులో ఉంచుతారు. స్వీట్ ఐటమ్ గా ఏదో ఒక రకం స్వీట్ ను పెడతారు.
ALSO READ : పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ?