Advertisement
శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఐదవ అవతారం మరియు మొదటి అవతారం వామనుడు.. ఈ వామనుడు అతిథి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ దశమి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు. ఈ విధంగా బలిని అణచివేసే సమయం కోసం ఎదురు చూడ సాగాడు. అయితే ఒకసారి బలి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తోంది.
Advertisement
also read:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో మీకు తెలుసా.. ఏ నెంబర్ ఉన్న పండ్లు మంచివంటే..?
Advertisement
బలిని తొక్కడానికి ఇదే సరైన సమయంగా విష్ణుమూర్తి చిన్నారి బ్రాహ్మణుడు వామనుడి రూపంలో యాగశాల వద్దకు వెళ్తాడు. దీంతో బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తమకు యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. దీంతో బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నా అతడు వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయిన మహా విష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కనిపెడతాడు. ఇదే విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. కానీ అప్పటికే ఆయన మాట ఇచ్చేశానని, ధనం మరియు ప్రాణం మీద వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని అంటాడు. దీంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించి వెళ్లి పోతాడు. దీని తర్వాత బలిచక్రవర్తి పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని, వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశం తో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లను పోసుకుంటాడు.
ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశానికి రంద్రం చేస్తాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్శపుల్లతో రంధ్రాన్ని పోడవగా తనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు. అలా దాన్ని కోరిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ లోకమంతా ఆక్రమించేస్తాడు.. ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేస్తాడు.. ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. దీంతో బలిచక్రవర్తి నా తలపై వేయి అంటూ తల వంచుతాడు . దీంతో వామనుడు తన మూడవ అడుగును బలి నెత్తి పైన వేసి అదః పాతాళానికి తొక్కేస్తాడు. ఈ విధంగా వామనుడు అడిగిన మూడు అడుగుల వెనక అర్థం ఉంటుంది.
also read:చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?