Advertisement
ఈ మధ్య కాలంలో పేద, ధనిక అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ కార్లను వాడుతున్నారు. అయితే.. సాధారణంగా రోడ్డుపైన వివిధ రకాల కార్లను, వాహనాలను చూసి ఉంటారు. కానీ కొన్ని కార్లకు వెనుక వైపున ఉన్న విండ్ షీల్డ్ పై లైన్స్ ఉండటం గమనించి ఉండవచ్చు. అయితే ఈ విండ్ షీల్డ్ పై ఉన్న లైన్స్ చూసినప్పుడు మీకు సందేహం వచ్చి ఉండవచ్చు. ఎందుకు కొన్ని కార్లకు మాత్రమే ఈ విధమైన లైన్స్ ఉన్నాయని, బహుశా అవి స్టిక్కర్స్ అని ఊహించి ఉండవచ్చు. కానీ అవి స్టిక్కర్స్ కాదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా కారు విండోస్ పై వైపర్ బ్లేడ్లు ఉంటాయి. వర్షం పడిన సమయంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. వర్షపు నీరు విండోస్ పై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకుండా ఉన్న సమయంలో ఇవి నీటిని శుభ్రం చేస్తూ, మార్గం స్పష్టంగా కనిపించే విధంగా ఉపయోగపడతాయి. దీని తర్వాత దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమిటంటే, విండ్ షీల్డ్ లైన్స్ మీరు ఈ సన్నని లైన్స్ ను కారు వెనుక వైపు గల విండోస్ మీద గమనించే ఉంటారు. కానీ అవి ఎందుకు ఉంటాయి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? షో కోసమే అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
Advertisement
కారు వెనుక వైపు విండోస్ మీద ఉండే ఈ లైన్స్ ను Defoggers అని పిలుస్తారు. ఇవే ఎలక్ట్రికల్ లైన్స్, వీటి ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. విండో గ్లాస్ వేడిగా అవుతుంది. దీనితో విండో మీద చేరిన తేమ, మంచు తొలగిపోయి స్పష్టమైన వ్యూ మనకు కనిపిస్తుంది. కారులో ఉన్న ఈ చిన్న లైన్స్ మీకు పెద్ద టెక్నాలజీగా అనిపించకపోవచ్చు. కానీ, అవి ప్రయాణికులకు భద్రత సౌకర్యానికి వీలుగా ఉంటాయి. ఇక ఈసారి మీరు లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏదైనా కార్ల తయారీ కంపెనీ ఇలాంటి చిన్న చిన్న విషయాలతో శ్రద్ధ చూపిస్తుంది అంటే ఎంతో గర్వించదగిన విషయమే.
Read also : నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!