Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు యాక్షన్ సినిమాలు, ప్యాక్షన్ సినిమాలు, కుటుంబ నేపథ్య కథలతో ఉన్న సినిమాలు వచ్చాయి.. ఇందులో కుటుంబ నేపథ్య కథలు కలిగిన సినిమాలు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోని గోదావరి అందాలు, కొబ్బరి తోటలు, ఆప్యాయతలు, నోరూరించే వంటలు. శ్రీకాకుళం జిల్లాల విషయానికి వస్తే వినిపించేది వెటకారం, ఇక రాయలసీమ విషయానికి వస్తే గొడ్డుకారం యాక్షన్ వంటి కథలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యాలలో ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ యాస భాషతో అనేక చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఎంతోమంది పోరాట వీరుల కథలు, ఆంధ్ర పెత్తనం కింద నలిగిపోయిన సామాన్యుల జీవితాలు గుర్తుకు రావాలి.
Advertisement
అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుత సినిమాల్లో తాగుబోతులు ఉన్న రాష్ట్రంగా చూపించాల్సిన గత్యంతరం ఎందుకు వస్తుంది.? ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన బలగం దసరా సినిమాలతో దర్శక నిర్మాతలు ఏం మెసేజ్ ఇచ్చినట్టు..? బలగం, దసరా సినిమాలను తీసుకుంటే ఇందులో మొత్తం ముక్క,సుక్క, మత్తు చుట్టే తిరుగుతుంది. అంటే ఇందులో తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో మద్యం బానిసలు అన్నట్టు తెలంగాణకు చెందిన దర్శకులు చూపించడం మరి దారుణం. అయితే ఇప్పటివరకు మనం చూసిన సినిమాలలో ఏదైనా తాగుబోతు పాత్ర ఉంటే వారికీ కాస్త తెలంగాణ భాషలో మాట్లాడుతున్న పాత్రలని ఉపయోగిస్తూ ఉండేవారు. ఎలాంటి నెగిటివ్ పాత్రలు చేసినా ఆ పాత్రకు తప్పనిసరిగా తెలంగాణ యాస, భాషను ఉపయోగించి కించపరుస్తూ వచ్చారు.
also read: రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?
Advertisement
ఇక ప్రత్యేక రాష్ట్రంలో కూడా తెలంగాణ దర్శకులే తెలంగాణ వారంటే చిన్నచూపు చూడడం నిజంగా దారుణం. చాలామంది దృష్టి పెట్టి ఆలోచిస్తే బలగం, దసరా సినిమా పూర్తిగా పరిశీలిస్తే ఇందులో కథ మొత్తం మద్యం మత్తు, మటన్ ముక్క చుట్టూ తిరిగింది.. బలగం సినిమాలో కాస్త బంధాలను జోడించారు కానీ, ఇక దసరా సినిమా విషయానికి వస్తే పూర్తిగా చిన్నపిల్లల నుంచి ముసలి తల్లి వరకు మద్యం తాగుతూనే కనిపించింది. తెలంగాణ అంటే మధ్యమేనా.. మద్యం ఏరులై పారడమేనా అంటూ కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు.. మన పెద్దలు చూపిన ఎన్నో సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మనకు ఉన్నాయి.
also read: 1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?
వాటిని ఫాలో అవ్వాలి కానీ వాటిని మద్యంతో జతకట్టి సినిమాల హిట్ల కోసం ప్రజలను మద్యం తాగే వ్యక్తులుగా చిత్రీకరించడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే అవుతుందని అంటున్నారు. టాలెంట్ నిరూపించుకోవాలి కానీ ప్రాంతాన్ని కించపరుచుకోవడం మరి దారుణం. సినిమా అంటే అన్ని హంగులు ఉంటాయి కానీ సినిమాలో మద్యాన్నే ప్రధానంగా చూపించి, మద్యం లేకుంటే బతుకు లేదు అన్నట్టుగా చిత్రీకరణ చేసి, తెలంగాణ దర్శకులే అవమానించడం మరి దారుణం. నిజంగా తెలంగాణ భాషా,యాస సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలిసి ఉంటే ఇలాంటి సినిమాలు తీసి అగౌరవపరచారు అంటూ కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి..
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 04.04.2023