Advertisement
నవరాత్రులు మొదలైపోయాయి. తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అందరూ కొలుస్తారు. నవరాత్రులలో ఉపవాసాలు కూడా చేస్తారు ఈ ఉపవాసాల్లో కొన్ని రకాలు ఉంటాయి. అలాగే ఉపవాసం చేసే వాళ్ళకి కొంత మందిలో సందేహాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో అసలు ఏం తాగొచ్చు, ఏం తాగకూడదు, ఏం తినాలి ఇవన్నీ కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. చాలామంది ఉపవాసం సమయంలో టీ, కాఫీలు తీసుకోవచ్చా లేదా అనేది తెలియక తికమక పడుతుంటారు. టీ, కాఫీలు తాగకూడదని కొందరు అంటారు. మరి కొంతమంది ఉపవాసం సమయం లో టీ కాఫీలు తాగొచ్చని నమ్ముతారు.
Advertisement
అయితే వాస్తవానికి ఉపవాసం చేసేటప్పుడు టీ తాగకూడదన్న నిబంధన లేదు. చాలామంది ఇలాంటి సమయాల్లో పానీయాలని సేవిస్తారు. ఉపవాసం చేసేటప్పుడు ఇతర స్నాక్స్ వంటి ఆహార పదార్థాలు తినొచ్చా లేదా అనే విషయానికి వస్తే.. ఫూల్ మఖాన, వేరుశనగ పలుకులు, బాదంపప్పు, జీడిపప్పు, బంగాళదుంప చిప్స్ ని స్నాక్స్ కింద తీసుకుంటారు.
Advertisement
Also read:
ఉపవాసం చేసే వాళ్ళు రైస్ లేదా కిచిడి, సాబుదానా కిచిడి వంటివి తీసుకోవచ్చు. ఇవి తినలేము అని అనుకునే వాళ్ళు పండ్లు కూడా తీసుకోవచ్చు. పాలు, పెరుగు తో తయారు చేసిన పదార్థాలని తీసుకోవచ్చు. గోధుమలు, బియ్యం, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి ఏ రకమైన దాన్యాలని తినకూడదు. ఉప్పుని కూడా ఉపవాసంలో తీసుకోకూడదు. ఆవనూనె, మసాలా దినుసులు కూడా ఉపవాస సమయంలో తీసుకోకూడదట. అలాగే చాలా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ సమయం ఆహారం లేకపోవడం వలన పొట్ట ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!