Advertisement
చాలా మందికి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. సరదాగా రాఖీ పండుగ నాడు సోదరులతో గడపాలని అనుకుంటుంటారు. అయితే ఈ సారి రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని చూద్దాం. ఈ సారి రాఖీ పండుగ రెండు రోజులు వస్తోంది. పండితులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే, రాఖీ పండుగ ఆగస్టు 30న ఈసారి వచ్చింది. అయితే పండుగ రోజు భద్ర నీడ ఉంది. ఆగస్టు 30న ఉదయం 10:59 గంటల నుండి రాత్రి 09:02 వరకు భద్రకాలం ఉన్నది.
Advertisement
Advertisement
ఈ సమయంలో రాఖీ కట్టుకుంటే మంచిది కాదని పండితులు అంటున్నారు. ఈ భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టుకోవడం మంచిది. రాఖీని ఆగస్టు 30న రాత్రి 9:15 గంటల తర్వాత శుభముహూర్తం మొదలవుతుంది కదా అప్పుడు కట్టుకుంటే మంచిది. ఆగస్టు 31న ఉదయం 07:05 నిమిషాల వరకు రాఖీ కట్టుకోవచ్చు. ఆగస్టు 30, 31 తేదీల్లో ఇలా ఈ సమయంలో రాఖీ కట్టుకుని పండుగ జరుపుకోవాలని పండితులు అంటున్నారు.
Also read: