Advertisement
ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తనదైన రేంజ్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేశారు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అందరూ చెప్పడం జరిగింది. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకునే ప్రభాస్ అలానే పాన్ ఇండియన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా కలిసి చేసిన ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అయ్యింది.
Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా ఇంకొక కీలక పాత్రలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు ఆయన కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమాలో చూసినట్లయితే ఖాన్సర్ అనే ఒక సిటీ నేపథ్యంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆ సిటీ మీదే అంతా ఆరా తీస్తున్నారు. ఆ సినిమా చూసిన వాళ్లంతా కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అని వెతుకుతున్నారు. ఇక ఈ విషయం గురించి ఇప్పుడే చూద్దాం. ఇరాన్ లోని ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లో ఉందిది. ఇక్కడేమో 22 వేలకు పైగా పరిషియన్లు ఉంటున్నారట.
Advertisement
మూవీ లో చూపించిన ఖాన్సర్ సిటీ కి ఇరాన్ లోని ఖాన్సార్ కౌంటి కి లింక్ అయితే ఏమీ లేదు. సినిమా కోసం జస్ట్ ఇమాజిన్ తో సృష్టించిన ప్రాంతం మాత్రమే. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కోసం కేవలం ఈ పేరు ని మాత్రమే వాడారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాగా కలెక్షన్ లని రాబడుతోంది ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కొట్టికి పైగా వసూళ్లను రాబడుతుందని చాలా మంది అభిప్రాయాన్ని చెప్తున్నారు ఇప్పటికే రెండు వేల కోట్ల కలెక్షన్స్ తో బాహుబలి సినిమా ఇండియాలో నెంబర్ వన్ కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ ని ప్రభాస్ దాటబోతున్నాడని సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరి సినిమా ఎంత వసూళ్లని రాబట్టగలదో చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!