Advertisement
ఇండస్ట్రీలో ఎటు చూసినా హీరోయిన్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. మహా అంటే స్టార్ హోదా తెచ్చుకుంటే ఐదు నుంచి పది సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతారు తప్ప అంతకంటే ఎక్కువ కొనసాగడం చాలా కష్టం.. అయితే ఈ సమయంలోనే చాలా మంది హీరోయిన్స్ చేతికందినంతా సంపాదించుకోని లైఫ్ సెట్ చేసుకుంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపారాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. మరి వారు ఎవరో మనం చూద్దాం..
Advertisement
తాప్సీ :
చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది తాప్సి.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే మూవీ తో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది. నటనలో రాణిస్తూనే బిజినెస్ లో అడుగుపెట్టింది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే సంస్థ తన సిస్టర్ తో కలిసి స్థాపించి ఇండియాలో ఉన్న వీఐపీల పెళ్లిళ్లు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది.
నయనతార :
నయనతార 2003లో మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. చేతి నిండా సినిమాలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తూనే ది లిప్ బమ్ అనే కాస్మోటిక్ కంపెనీ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చాలా సినిమాలు నిర్మిస్తోంది. ఫుడ్ బేవరేజ్ కంపెనీలు కూడా స్టార్ట్ చేసింది.
Advertisement
శ్రియా శరణ్ :
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2001లో వచ్చిన ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీయ, 21 ఏళ్లు ఇండస్ట్రీని ఏలింది. ఈమె ఓ వైపు సినిమాలు చేస్తూనే శ్రీ స్పందన స్పా అనే కంపెనీ స్థాపించింది. ఇది ఇండియాలోనే స్పా బిజినెస్ లో టాప్ కంపెనీ.
రకుల్ ప్రీత్ సింగ్ :
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ కొట్టింది. ఈమె తన ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందని అందరికీ తెలుసు. ఫిట్నెస్ హెల్త్ హబ్ అనే ప్రాంచైజీ తీసుకొని ఇండియాలోని అన్ని మెట్రో సిటీల్లో జిమ్ లు ఓపెన్ చేసి రెండు చేతులా సంపాదిస్తుంది.
కాజల్ అగర్వాల్ :
కాజల్ తెలుగు ఇండస్ట్రీలోని అందరూ అగ్ర హీరోలతో నటించింది. లక్ష్మీ కళ్యాణం అనే మూవీ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఒక జువెలరీ కంపెనీ తన చెల్లెలు తో కలిసి లాంచ్ చేసింది.
ALSO READ;