Advertisement
Rachin Ravindra: వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ మ్యాచ్లో.. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 282 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది. 36 త్వరలోనే 283 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే ఈ విషయంలో.. రచిన్ రవీంద్ర పాత్ర కీలకమైనది. ఈ మ్యాచ్ లో 123 పరుగులు చేసి న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు రవీంద్ర. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
Advertisement
ఇవి కూడా చదవండి: హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
ఇవి కూడా చదవండి: మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే, క్రికెటర్స్ ఏమి చేస్తారు?
Advertisement
అయితే ఈ రచిన్ రవీంద్ర… మన ఇండియాకు చెందిన వాడే కావడం విశేషం. 23 సంవత్సరాల రవీంద్ర తల్లిదండ్రులది ఇండియానే. రవీంద్ర పుట్టకముందు ఆయన తండ్రి రవి కృష్ణమూర్తి… బెంగళూరులోనే ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడు. అయితే 1990 సంవత్సరంలో న్యూజిలాండ్ కు వెళ్లారు రవి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు. అయితే న్యూజిలాండ్ కి వెళ్లిన తర్వాత రవీంద్ర పుట్టాడు.
అయితే రవి కృష్ణమూర్తికి సచిన్ మరియు రాహుల్ ద్రావిడ అంటే చాలా ఇష్టం. అందుకే వారిద్దరి పేరు వచ్చేలా తన కొడుకుకు రచిన్ రవీంద్రా అని పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు రవీంద్ర తండ్రి హాట్ హాట్ పేరుతో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేశాడు. ఈ క్రికెట్ క్లబ్ లో భాగంగానే తరచూ న్యూజిలాండ్ నుంచి అనంత పురం.. కు వచ్చి క్రికెట్ ఆడేవాడు రవీంద్ర. కాదా 2021 సంవత్సరంలో టీమిండియా తో జరిగిన టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు రవీంద్ర. ఇక ఇప్పుడు మొదటి వరల్డ్ కప్ లోనే మెరిశాడు రవీంద్ర.
ఇవి కూడా చదవండి: పెట్రోల్ కోసం ₹30 అడగడం నుంచి..₹4 లక్షలను విరాళంగా ఇవ్వడం వరకు మొహమ్మద్ సిరాజ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసారో తెలుసా?