Advertisement
ఆ మధ్య కాలంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన మూవీ “గార్గి”.. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా నడవక పోయినా కథ మాత్రం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. అసలు “గార్గి” అంటే ఎవరు.. ఆ పేరుని దర్శకుడు ఎందుకు తీసుకున్నారు.. అనే విషయాలు చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వేద కాలంలోనే స్త్రీశక్తి మేధస్సును చాటిన మహిళల్లో గార్గి ఒకరు. వచకునుడు అనే రుషి కూతురు ఈమె. వాచకునుడు సకల శాస్త్ర పరాయణుడు. వేద పండితుడు. ఆయన ఇంట్లో పెరుగుతున్న గార్గికి కూడా ఆ వేదాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. వాటిని అభ్యసించడం కొరకు పురుషులతో సమానంగా ఉపనయనం చేసుకుంది. ఒక్కొక్క శాస్త్రాన్ని అవపోసన పట్టింది. ఏకంగా బ్రహ్మ వాదిని అనే బిరుదు సాధించింది. గార్గి గురించి ప్రస్తావన బృహదారణ్యక ఉపనిషత్తులలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో జనకుని సభలో యాజ్ఞవల్క రుషిని ఆమె ముప్పుతిప్పలు పెడుతుంది.
Advertisement
also read: ఈ 8 మంది హీరోయిన్లు 40 ఏజ్ ఉన్న..వారి 1st సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారే..!!
Advertisement
జనకుడు బ్రహ్మజ్ఞానంలో సాటి లేని వ్యక్తికి వేయి గోవులను బహుమతిగా ఇస్తానని, ఆ గోవుల కొమ్ములన్నింటికీ బంగారు తాపడం చేయిస్తానని చాటింపు వేస్తాడు. ఇక యాజ్ఞవల్క్యుడికి తిరుగులేదు అనుకుంటున్న సమయంలో గార్గి తన ప్రశ్నల పరంపరను ఆరంభిస్తుంది. ఒకానొక దశలో ఆ ప్రశ్నలు తట్టుకోలేని యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ గురించి మరింత లోతుగా ప్రశ్నించడం మంచిది కాదని, అలా చేస్తే మీ తల పగిలిపోతుందని హెచ్చరిస్తాడు. అంతటితో శాంతిస్తుంది గార్గి. ఒకరకంగా ఇది ఆమె విజయంగా చెప్పవచ్చు. అంటే బ్రహ్మ జ్ఞానం లో ఉన్న పురుషులను సైతం ఆమె ఓడించింది. జనకుని కొలువులో నవరత్నాలలో ఒకరైన గార్గి..ఆమె ఆ జన్మ బ్రహ్మచారినిగా ఉండిపోయిందని అంటుంటారు. అలాగే గార్గి ఋగ్వేదంలో కొన్ని ఘట్టాలను కూడా రాసిందని చెబుతారు. అలాగే ఉపనిషత్తులతో గార్గి యొక్క ప్రస్తావన తెలుస్తుంది.
ఈమె జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు,తమిళ, కన్నడ, భాషల్లో విడుదలైన ఈ సినిమాను గౌతం రామచంద్రను తెరకెక్కించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. ఇందులో గార్గి పాత్రలో సాయి పల్లవి స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. హైదరాబాదులో మారుమూల జీవితం గడుపుతూ, ఆమె తండ్రి పాత్రలో బ్రహ్మానందం ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటారు. ఒక రోజు రాత్రి సమయం అయిన ఆమె తండ్రి ఇంటికి రాకపోవడంతో “గార్గి”( సాయి పల్లవి )అతన్ని వెతుక్కుంటూ వెళుతుంది. ఆ టైంలో ఆమె తండ్రిని తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఒక కేసులో అరెస్టు చేశారని తెలుసుకుంటుంది. తన తండ్రి తప్పు చేయాడని బలంగా నమ్మిన గార్గి అతను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి న్యాయపోరాటం మొదలుపెడుతుంది.. అందులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది అనే నేపథ్యంలో ఈ కథను చూపించారు.
also read:ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని 6గురు డైరెక్టర్లు ఎవరో తెలుసా..?