Advertisement
దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారు మ్రోగి పోతోంది. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆల్ ఇండియా ఈ డైరెక్టర్ కి ఫిదా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ గురించిన డిస్కషన్స్ నడుస్తున్నాయి. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యిన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్స్ వర్షం కురిపించింది. సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలకు పైనే అవుతున్న.. కలెక్షన్ల వర్షం మాత్రం ఆగలేదని చెప్పాలి.
Advertisement
రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. సినిమా విజయం పై అందరు హర్షం వ్యక్తం చేసారు. అయితే.. ఈ సినిమా ఈవెంట్ లో ఒక వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనిపించరు. ఆ వ్యక్తికీ ప్రశాంత్ వర్మ లైఫ్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ ఆర్టికల్ లో చూసేద్దాం. సినిమాలంటే విపరీతమైన ఇంటరెస్ట్ ఉన్న ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారు. సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు.
Advertisement
మొదటి సారి అ! సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అది తరువాత కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కదిలించారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆయన తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు ప్రశాంత్ వర్మ భార్య సుకన్య. ప్రశాంత్ వర్మకు కోవిడ్ సమయంలోనే వివాహం అయ్యింది. ఆయనది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టర్ కాకపోవడంతో పెళ్లి అయ్యిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రశాంత్ వర్మని చూస్తే అప్పుడే పెళ్లి అయిపోయిందని ఎవరూ అనుకోరు. ఆయన చాలా యంగ్ గా కనిపిస్తారు. కానీ ఈవెంట్ లో తన భార్యను పరిచయం చేస్తూ.. ఓ డైరెక్టర్ గా ఎదగడానికి ఆమె తనకు చాలా సపోర్ట్ ఇచ్చారు అంటూ అందరి ముందు థాంక్స్ తెలిపారు. ఆమె కూడా చాలా అందంగా ఉండడంతో.. వారిద్దరిని చూసిన నెటిజన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మురిసిపోతున్నారు.
Read More:
Ambajipeta Marriage Band Review : సుహాస్ కెరీర్ లో బెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. !
Miss Perfect Web Series Review : మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ హిట్టా..? ఫట్టా..?
Pawan Kalyan Janasena: పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్