Advertisement
అక్కినేని నాగేశ్వరావు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నాగేశ్వరరావు అందరికీ సుపరిచితమే చాలా సినిమాలో నటించే మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు నాగేశ్వరావు తర్వాత ఇండస్ట్రీ లోకి నాగార్జున కూడా వచ్చారు. అయితే నాగేశ్వరరావు గురించి నాగార్జున గురించి మనకి తెలిసినవే అక్కినేని అన్నపూర్ణ గురించి చాలామందికి తెలియదు. అక్కినేని అన్నపూర్ణ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. అప్పట్లో సినిమా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు కాదు సినిమా వాళ్ళ అంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు నాగేశ్వరరావు సన్నిహితులు ఆయన పెళ్లి కోసం అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. అయితే అన్నపూర్ణ తండ్రి కూడా తన కూతురు కోసం వరుణ్ణి వెతుకుతున్నారు. ఆ టైంలో అక్కినేని నాగేశ్వరరావుకి పెళ్లి చేద్దాం అనుకున్నారు.
Advertisement
Advertisement
దగ్గర వాళ్ళతో చెప్తే సినిమా వాళ్లకి ఇచ్చి గొంతు కోస్తారా అని అడిగారట అయినా కూడా నాగేశ్వరరావు గారిని నమ్మి ఆయన పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇలా వీళ్ళ పెళ్లి మొత్తానికి పూర్తయిపోయింది. పెళ్లయిన తర్వాత అక్కినేని అన్నపూర్ణ ఆయన సినిమాల విషయంలో కూడా జోక్యం చేసుకునేవారు. శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా లో కృష్ణార్జున పాత్రలలో ఏఎన్నార్ ఎన్టీఆర్ నటించారు. ఇరువురు తలపడ్డ సన్నివేశాలు చూసి ఎన్టీఆర్ గారు లేకుండా మీరు నటించిన సన్నివేశాలు బాగున్నాయి.
కానీ ఆయనతో ఢీ అంటే ఢీకొట్టే పాత్రలు లో ఆయన ముందు తేలిపోతున్నారు ఇకమీదట ఎన్టీఆర్ తో మీరు ఇలాంటి సినిమాలు చేయొద్దని అక్కినేని అన్నపూర్ణ చెప్పారట అలా అన్నపూర్ణ చెప్పడంతో ఏఎన్ఆర్ గారు నా బలాలు బలహీనతలు ఆమె బాగా తెలుసుకుంటున్నారని అనుకున్నారట. అలానే అక్కినేని నాగేశ్వరరావు అన్నయ్యలు డబ్బులు అడిగితే నాగేశ్వరరావు గారు ఇచ్చేవారు కాదట ఆయన అలా వెళ్ళగానే నాగేశ్వరరావు గారికి తెలియకుండా ఆమె వాళ్ళ అన్నయ్యలకి డబ్బులు ఇచ్చేవారట ఆయన ఏదో షూటింగ్ పనుల్లో హడావిడిగా ఉన్నారని చెప్పేవారట అన్నపూర్ణ గారు. ఏఎన్ఆర్ గారిని బాగా అర్థం చేసుకున్నారు అలానే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా బాగా చూసేవారు అన్నపూర్ణ.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!