Advertisement
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం విరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయకగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. ఈ చిత్రంలో విలన్ గా దునియా విజయ్ అద్భుతంగా నటించారు. మరో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలయ్య కి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు.
Advertisement
Read also: అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలోని ఓ సీన్ పై నేటిజెన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. ఆ సీన్ ఏంటంటే.. విలన్లకు అదిరిపోయే రేంజ్ లో ఓ డైలాగ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఉన్న కారును బాలకృష్ణ కాలితో తంతే వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పట్లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు లో కూడా బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ కూడా ఇలాగే వెనక్కి వెళ్తుంది. దీంతో ఈ రెండు సన్నివేశాలను పోలుస్తూ నెటిజెన్లు దర్శకుడు, నటుడిని ట్రోల్ చేశారు.
Advertisement
అయితే ఈ ట్రోలింగ్ పై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. “ఆ సీన్ లో విలన్లు కారులో అప్పటికే రివర్స్ గేర్ వేసి ఉంటారు. కానీ టైర్లు బురదలో ఇరుక్కుపోవడం వల్ల కారు వెనక్కి వెళ్ళలేదు. బాలకృష్ణ డైలాగ్ చెప్పిన తర్వాత కాలితో కారుని తంతారు. దీంతో మట్టిలో దిగబడిపోయిన కారు టైరు పైకి లేస్తుంది. అప్పటికే కారు రివర్స్ గేర్ లో ఉన్నందున అది వెనక్కి కాకుండా ముందుకి వస్తుందా? మీరే చెప్పండి. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీమ్స్ చేసే వాళ్ళు రకరకాలుగా చేస్తారు. ఈ సీన్ గురించి బాలకృష్ణ గారితో చర్చించాకే తీశాను” అని వివరించారు దర్శకుడు గోపీచంద్ మలినేని.
Read also: “వీర సింహ రెడ్డి” హీరోయిన్ హనీ రోజ్ వయసు ఎంతో తెలుసా..? వామ్మో ఇది అస్సలు నమ్మలేరు ??