Advertisement
కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. కృష్ణం రాజు అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే.
Advertisement
ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రభోద్ అసలు ఏం చేస్తాడు, సినిమాల్లో ఎందుకు రాలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రబోద్ కి చిన్నప్పటినుండే వ్యాపారం పై మక్కువ, అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కృష్ణంరాజు అప్పట్లో అడిగినా కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించని ప్రబోద్ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపించలేదట. ప్రభాస్ సన్నిహితులు యువి క్రియేషన్స్ మొదలుపెట్టిన సమయంలో ప్రబోద్ ని కూడా భాగస్వామిగా అనుకున్నారట. కానీ ఆయన మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చారట. అందుకే మీడియా ముందుకు కూడా ప్రబోద్ ఎప్పుడు రాడు.
Advertisement
ఆ మధ్య తండ్రి చనిపోయిన సమయంలో కూడా ప్రబోద్ గురించి ఎక్కువ మందికి తెలియలేదు. ఇన్నాళ్లకు ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చిన కారణంగా ఆయన అన్న ప్రబోద్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రబోద్ ముందు ముందు అయినా సినిమాల్లో లేదా మరి ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో కనిపిస్తాడా అంటే కచ్చితంగా లేదని సన్నిహితులు అంటున్నారు. కానీ ప్రబోధికి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణంరాజుకి ఉన్న రాజకీయ నేపథ్యంతో ప్రబోద్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read also : నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!