Advertisement
ప్రతి ఇంట్లో కంప్యూటర్ వాడకం కామన్ అయిపోయింది. గతంలో కంప్యూటర్ అంటేనే ఎవరికి తెలియకుండా ఉండే రోజుల నుంచి ఇప్పుడు.. ప్రతి చిన్న పిల్లవాడు కంప్యూటర్ లేనిదే ఉండటం లేదు. ఇలాంటి తరుణంలో కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి న అవసరం అందరికీ ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డ్ లలో ఉండే F మరియు J కీ లను “పొజిషన్ కీస్”అని కూడా పిలుస్తారు. ఈ పొజిషన్ కీ ల క్రింది భాగంలో “అడ్డంగా”, లేదా “మైనస్ ఆకారంలో” ఉండే సన్నని గీతలకి కారణం ఏమిటంటే మీరు కీబోర్డ్ మీద టైపు చేసే సమయంలో సులభంగా ఉండడం కోసం. సాధారణంగా మనం కంప్యూటర్ కీబోర్డ్ ని చూడకుండానే మన కుడి, మరియు ఎడమ చేతి వేళ్లను ఆడిస్తూ టైపు చేయగలుగుతాం. మొదట్లో అలా చూడకుండా టైపు చేయడం కష్టమైనప్పటికీ, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని కూడా టైపు చేయవచ్చు.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
Advertisement
అయితే అలా ప్రాక్టీస్ చేసుకున్న సమయంలో ఎలాగో మనం కీబోర్డ్ వైపు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ “F” మరియు “J” కీ ల క్రింది భాగంలో అడ్డంగా ఉండే గీతలు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గీతల వల్ల త్వరగా టైపింగ్ నేర్చుకోవడమే కాకుండా, ఏ ఏ అక్షరాలపై మన చేతి వేళ్ళు పడుతున్నాయో తెలుసుకొని దాని ప్రకారం సులభంగా తప్పులు లేకుండా టైపు చేయవచ్చు.
ఈ గీతలు F మరియు J ల పైన మాత్రమే ఎందుకు ఇచ్చారు. వేరే అక్షరాలపై కూడా ఇవ్వొచ్చు కదా! అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. అయితే దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. టైపు చేసేటప్పుడు మన ఎడమ చేతి యొక్క చివరి మూడు వేళ్ళు”A, S, D” అక్షరాలపై, మరియు కుడి చేతి యొక్క చివరి మూడు వేళ్ళు “K,L,j”లపై ఉంటాయి. ఇక రెండు చేతులకు చెందిన చూపుడు వేళ్ళలో ఎడమచేతి చూపుడువేలు F అక్షరం మీద మరియు కుడి చేతి చూపుడువేలు J అక్షరం మీద ఫిక్స్ అవుతాయి. దీంతో మిగిలిన అక్షరాలను కూడా టైపు చేయడం సులభతరం అవుతుంది. మన చేతి వేళ్ళకు మరియు కీబోర్డ్ లోని అక్షరాల పొజిషన్ కి ఆ స్థానాలే అనుగుణంగా ఉంటాయి.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?