Advertisement
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు..అదేంటో మనం చూద్దాం.. పురాణ కథల ప్రకారం తిరుమలేశుని భక్తులలో అనంతాళ్వారు స్వామి అగ్రగణ్యుడు. ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ ధ్యానంలో ఉండేవారు. ఈయన ప్రతి రోజు స్వామివారి పూలను సమర్పిస్తూ సేవలో ఉంటూ దర్శించుకునే వారు. ప్రతిరోజు తెచ్చే పూలతోటను మరింత పెంచాలని అనంతాళ్వార్ నిశ్చయించుకుంటాడు. తోట పెంచాలంటే నీరు కావాలి.. కాబట్టి ఆయన తన తోటలో చెరువు తవ్వాలి అని భావిస్తాడు.
Advertisement
దీంతో అనంతాళ్వార్ అతని భార్య ఇద్దరూ కలిసి చెరువు తవ్వడం మొదలుపెడతారు. కానీ ఆ సమయంలో అనంతాళ్వార్ భార్య నిండు గర్భిణీ. అతను గడ్డపారతో మట్టి తీస్తుంటే, భార్య మట్టిని గంపలో వేసుకొని దూరంగా వేసేది. గర్భిణీ కావడంతో ఆ పని చేయడానికి చాలా ఇబ్బంది పడి అలసి పోయేది. ఈ తతంగాన్ని గమనించిన శ్రీ వేంకటేశ్వరుడు 12 సంవత్సరాల బాలుడు రూపంలో అనంతాళ్వార్ దగ్గరికి వెళ్లి సహాయం చేస్తానని అడిగితే ఆయన ఒప్పుకోడు. కానీ భార్య ఒప్పుకోవడంతో ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ బాలుడు. దీన్ని గుర్తించిన అనంతాళ్వార్ తన భార్యను ప్రశ్నిస్తే, ఆ బాలుడు సహకారం అందిస్తున్నారని భార్య భర్త కు తెలుపుతుంది.
Advertisement
ALSO READ:ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !
దీంతో కోపానికి వచ్చిన అనంతాళ్వార్ చేతిలో ఉన్న గునపంతో ఆ బాలుడు మీదకి విసురుతాడు. ఆ గునపం బాలుడి గడ్డానికి తగలడంతో తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. దీంతో ఆ బాలుడు అక్కడినుంచి ఆనంద నిలయానికి మాయమవుతాడు. ఆలయంలో గర్భగుడి నుంచి రక్తం కారడం చూసి ఆలయ అర్చకుడు ఆశ్చర్యపోతాడు. ఈ విషయం అర్చకులు అనంతాళ్వారు కు చెప్పగా కంగారుగా అక్కడికి చేరుకొని, శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడాన్ని గమనించి తనకు సహాయం చేయడానికి వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని భావిస్తాడు. తాను తప్పు చేశారని భావించి కన్నీరుమున్నీరవుతూ స్వామివారి పాదాలను తాకుతాడు. ఇక అప్పటి నుంచి గాయం అయిన చోట గంధం పూసి పచ్చ కర్పూరం పెట్టడం ప్రారంభమైంది.
ALSO READ: