Advertisement
జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తి భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత చిన్ని కృష్ణయ్య. చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చివాట్లు తిన్న ఆ బాల కన్నయ్యను అందరూ వెన్నదొంగ అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణుడు అందరి ఇళ్ళలో వెన్నను దొంగలించి తినడం వల్ల కన్నయ్యకు వెన్నదొంగ అనే పేరు వచ్చింది. కృష్ణుడు వెన్నను దొంగలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also : నరసింహ సినిమా లో నీలాంబరి క్యారెక్టర్ ను వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్ళలో వెన్న దొంగలించడంతోపాటు, వెన్నలా, స్వచ్ఛమైన, మృదువైన అందరి హృదయాలను కూడా దొంగలించేవాడు. వెన్న తెల్లగా ఉంటుంది. అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని, హృదయంలో కోపం, అహం, ద్వేషం, అసూయ వంటి వాటిని పోషించకూడదని అందరి హృదయం వెన్నల ఉండాలనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేశాడు. అందుకే కృష్ణుడిని చిట్టా చొర్ (హృదయాలను దొంగలించేవాడు) అని కూడా పిలిచేవారు. పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలికగా పైకి వస్తుంది. అదే విధంగా మన మనసు భౌతిక ప్రపంచం నుండి వేరు చేయాలి. అంటే మనసు వెన్నల తేలికగా ఉండాలి అని అర్థం.
Advertisement
చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోకులంలోని ఇళ్ళలో వెన్నను దొంగతనం చేసి అందరి మధ్య ఐక్యతను చాటాడు. అంతేకాకుండా వారిలో ఎంతో శారీరక బలం చేకూర్చాడు. అందువల్ల కృష్ణాష్టమి వేడుకలు జరిగినప్పుడు ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఒకరిపై ఒకరు నిలబడి ఐక్యతను చాటి చెబుతూ ఉంటారు అని దీని అర్థం. చిన్ని కృష్ణుడు తన బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ గోకులంలో అందరి మనసులు గెలిచేవాడు. కానీ తాను చేసిన పనులు క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులోని అంతరార్థం తెలుస్తుంది.
READ ALSO : “సింహరాశి” మూవీని బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?