Advertisement
మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేపల కూర వండుకోవడం అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కార్తె వచ్చింది కదా అని ప్రతి ఒక్కరూ చేపలు వండుకొని తింటారు. కానీ ఆ రోజు చేపలు ఎందుకు వండుకోవాలి.. మరేదైనా వండుకోవచ్చు కదా.. అనేది ఎవరు కూడా ఆలోచించరు.. మరి చేపల తినడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఓసారి చూద్దాం..? ఈ చేపల కూర వండు కోవడం అనే తంతు చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. దీన్ని మనం ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాం. మరి దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే..?
Advertisement
Advertisement
వాతావరణం అనేది ఒక్కొక్క కార్తెలో ఒక విధంగా మారుతూ ఉంటుంది. అయితే చాలా రోజుల నుండి బయట ఎండలు దంచి కొట్టాయి. ఈ ఎండలకు మన బాడీ కూడా కాస్త అలవాటు పడింది. కానీ ఇంతలోనే వాతావరణం అంతా చల్లబడింది. ఒక్కసారిగా వాతావరణం అనేది చల్లబడడంతో మన శరీరం అనేది ఈ వాతావరణానికి కాస్త డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ఆస్తమా లాంటివే కాకుండా డైజెస్టివ్ సిస్టం కూడా కాస్త నెమ్మదిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.





