Advertisement
సాధారణంగా మన భూమిపై భూభాగం కంటే నీరే ఎక్కువగా ఉంటుంది. ఇందులో చాలా వరకు నీరు మంచు రూపంలో గడ్డ కట్టి ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు సముద్రాల నీరే చాలామంది తాగే వారని మనకున్న సమాచారం. అయితే అలాంటి ఈ నీరు ప్రస్తుతం తాగకుండా ఉప్పగా ఎందుకు తయారైంది అనేది మనకు ఇప్పటి వరకు తెలియదు.. మరి అలా ఎందుకు తయారయిందో ఒకసారి చూద్దాం..?
Advertisement
కొన్ని లక్షల సంవత్సరాలు గడిచేకొద్దీ సముద్రంలో ఉండే నీరు ఉప్ప గా తయారయింది. సాధారణంగా వర్షం నీరు ముందుగా నదుల్లోకి చేరుతుంది. ఆ నదుల నుండి సముద్రంలోకి నీరంతా చేరుతుంది. ఆ సముద్రంలో ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల భాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడి మళ్ళీ వర్షం రూపంలో పడుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది. వర్షం పడ్డప్పుడు ఆ నీరంతా భూమిపై ఉండే ఖనిజాలను కూడా కలుపుకొని నదులలోకి వెళ్తాయి.
Advertisement
ఇందులో తక్కువ స్థాయిలో కరిగే లవణాలు ఉండటంవల్ల ఆ నీరు మనకు తాగడానికి తియ్యగానే ఉంటుంది. ఈ నీళ్లు నదుల నుంచి మళ్లీ సముద్రం లోకి వెళ్తాయి. ఇప్పుడు సూర్యుడి వేడి ఆవిరి గా మారిన నీరు పైకి వెళ్లి పోతుంది. కానీ వీటిలో ఉన్నటువంటి లవణాలు మాత్రం వెళ్లవు. కేవలం నీరు మాత్రమే ఆవిరై మేఘాల్లో కి వెళ్తుంది. ఆ ఖనిజా లవణాలు అన్నీ సముద్రంలోనే పేరుకుపోతాయి. ఈ విధంగా ఈ ప్రాసెస్ లక్షల సంవత్సరాల నుంచి జరగడం వలన సముద్రపు నీరు ఉప్పగా తాగడానికి పనికి రాకుండా తయారైపోయింది.
also read;
కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?