Advertisement
జగన్ విదేశాలకు వెళ్తున్నారా..? లేదంటే అక్కడే కొంతకాలం ఉండిపోవాలనుకుంటున్నారా..? ప్రధానంగా YCP వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బెంగుళూరు వెళ్లిన జగన్ మూడు రోజుల కిందట ఏపీకి వచ్చారు. తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ పై దృష్టి పెట్టారు ఆయన పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది. అక్రమస్తుల కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కోర్టు అనుమతి ఆయన తీసుకోవాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లమోట్ తీసుకున్నారు. సీఎంగా లేరు కనుక ఆ పాస్పోర్ట్ పనిచేయదు, అందుకనే పాత పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు. లండన్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
జగన్ ఇద్దరు కూతుర్లు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు గత ఐదేళ్లు కాలంగా ప్రతి ఏటా జగన్ దంపతులు లండన్ వెళ్లేవారు. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వం పై పోరాటం చేద్దామంటే పార్టీ శ్రేణులు పెద్దగా ఇష్టపడట్లేదు. కొంతమంది కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు జగన్ బెంగళూరుకి పరిమితం కావాలని భావించారు. అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించారు. పిల్లలు లండన్ లో ఉన్నందున అక్కడికి వెళ్లి కొద్దిరోజులు వాళ్లతో గడపాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఓటమి బాధతో ఉంది.
Advertisement
Also read:
పార్టీ శ్రేణుల సైతం బయటకు రావడానికి ఇష్టపడట్లేదు కొద్దిరోజుల పాటు రాజకీయాలను పరిశీలించి అప్పుడు ఆక్టివ్ గా మారాలని జగన్ అనుకుంటున్నారు. అందుకని లండన్ వెళ్లాలనుకుంటున్నారు ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కి లాంగ్ లీవ్ కోర్టు నుంచి లభిస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే లండన్ లో జగన్ నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న జగన్ శుక్రవారం బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ ని విడిచిపెట్టని జగన్ ఇప్పుడు మాత్రం తరచూ బెంగళూరులో గడుపుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!