Advertisement
వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీ మౌనంగా ఉన్నారు. వైసీపీ హాయంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఇద్దరూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. విజయవాడలో వరదలు ప్రభుత్వ సహాయం పైన స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తవుతున్నా పాలనపైన ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీలో రాజకీయాలు ప్రారంభించిన కొడాలి నాని, వంశీ వైసిపి లోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఆ ఇద్దరు నేతలు తీరు వివాదాస్పదం అయింది.
Advertisement
చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో పరుషపదజాలంతో విమర్శలు చేశారు మంత్రిగా ఉన్న టైంలో కొడాలి నాని చంద్రబాబుని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా సీరియస్ కామెంట్స్ చేసి విరుచుకుపడ్డారు. తాజా ఎన్నికల్లో ఇద్దరినీ ఓడించాలని లక్ష్యంగా టిడిపి జనసేన శ్రేణులు కలిసికట్టుగా పని చేసాయి. భారీ మెజారిటీతో వైసీపీ ఓడిపోయింది నాని పార్టీ అధినేత జగన్ తో పలు సందర్భాల్లో వరుసగా సమావేశమయ్యారు.
Advertisement
Also read:
ఇద్దరిపైన వేరువేరు కేసులు నమోదయ్యాయి. కోర్టుని ఆశ్రయించడంతో ఇద్దరు అరెస్టు కాలేదు తర్వాత ఇద్దరు మౌనాన్ని వీడలేదు. అయితే ఇప్పుడు ఇద్దరూ మౌనంగా ఉండడం వెనక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతకాలం వివరాలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీని విడిచిపెడతారని ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఆ మౌనానికి అర్థం ఏంటో తెలియాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!