Advertisement
హిందువులు వివిధ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. ఒక్కో దేవుడి కోసం ఒక్కో ప్రత్యేక పండుగను కూడా జరుపుతూ ఉంటారు. మామూలుగా మనం ఏ దేవుడికి కానీ ఏ దేవతకి కానీ పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పి మండపాన్ని తీసేస్తూ ఉంటాం తప్ప.. ఆ దేవుళ్ళని తీసుకువెళ్లి నిమజ్జనం చేయము. కానీ వినాయక చవితి వచ్చిందంటే వినాయకుడిని పూజించి వీలుని బట్టీ ఇళ్లలో మూడు రోజులు లేదంటే ఒక్క రోజుతో ఉద్వాసన చెప్పేసి నిమజ్జనం చేసేస్తూ ఉంటాం. అయితే ఎందుకు వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి..? మిగిలిన దేవుళ్ళని ఎందుకు నిమజ్జనం చేయకూడదు…? దీని వెనుక కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
నిజానికి దీని వెనుక శాస్త్రీయ రహస్యం ఉంది. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది అంతా కూడా ఈ మాసంలో పచ్చదనంతో నిండి పోతూ ఉంటుంది. నదులలో నీళ్లు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధ గ్రహానికి ఆకుపచ్చనివి చాలా ఇష్టం. అందుకనే మనం 21 గడ్డి జాతి మొక్కల్ని సమర్పిస్తూ ఉంటాం. భక్తులకు కోరికలని వినాయకుడి తీర్చాలని భూమి పైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గర మార్గం సముద్రమే.
Advertisement
అందుకని వినాయకుడి విగ్రహాలని నీటిలో నిమజ్జనం చేస్తారు. పైగా పత్రి తో వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. ఆ పత్రిని కూడా మనం నీటిలో కలిపేస్తూ ఉంటాం నిమజ్జనం అప్పుడు మనం ఆకులతో పాటుగా మట్టి వినాయకుడిని అందులో కలిపేయడం వలన.. ఆ మట్టి, ఆకులు వలన నీళ్లు పరిశుభ్రంగా మారుతాయి. క్రిమిరహితంగా మారిపోతాయి. ఇదే నిమజ్జనం చేయడం వెనుక కారణం.
Also read: