Advertisement
అమ్మాయిలైనా అబ్బాయిలైనా రిలేషన్ విషయంలో తమ పార్టనర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకుంటూ ఉంటారు. గతంలో ఇది కేవలం శారీరకంగా, ఆర్ధికంగా, కుటుంబ పోషణ విషయాలపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు, ఆనందం, మంచి శారీరక సంబంధం, స్నేహం మరియు మరిన్ని వాటి గురించి ఆశలు పెంచుకుంటున్నారు. కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ లేదా కె-డ్రామాలు మీ పర్సనల్ జీవితంపై కూడా ప్రభావితం చూపిస్తాయి. ఇటువంటి డ్రామాలో లాగ మీ జీవితంలో కూడా మీ పార్టనర్ ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవనప్పుడు పార్టనర్ ని చీట్ చేస్తూ ఉంటారు.
Advertisement
భావోద్వేగాలు, కోరికలు మరియు వ్యక్తిగత ఎదుగుదల తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇది ఆడవారిలో మరిన్ని క్లిష్టమైన సెంటిమెంట్స్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఫలితంగా వారు ఇతర సంబంధాలలో స్వాంతన పొందడానికి ఇష్టపడుతుంటారు. ఉన్న రిలేషన్ లో సమస్యల్ని సాల్వ్ చేసుకుని అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ని పొందడం కంటే.. బయట సంబంధాల్లో రెండిటిని తేలికగా పొందొచ్చని భావిస్తారు. అయితే.. వీటిల్లో చాలా వరకు రిలేషన్స్ ప్రేమతో మాత్రం అయి ఉండవు.
Advertisement
ఎక్కువ కాలం కొనసాగే రిలేషన్స్ లో అమ్మాయిలు ఉన్నప్పుడు.. వారు నిజంగా తమ ఫామిలీ పై శ్రద్ధ పెడతారు. ఫలితంగా ఆమెపై ఇంట్లోని వారు, తన పార్టనర్ తో సహా అందరు ఆధారపడతారు. కానీ,ఆమె మాత్రం తన పార్టనర్ పై ఆధారపడలేదు. అలా ఆధార పడడానికి కూడా అవకాశం కలగదు. అలా తన కంటూ ఓ భుజం ఆసరా కావాలి అని ఆమె భావించినప్పుడు కూడా.. అది తన భర్త నుంచి లభించనప్పుడు.. ఆమె ఆ అవసరాన్ని మరొకరితో వెతుక్కోవచ్చు. ఓ భార్యగా, తల్లిగా, కోడలిగా ఉండాల్సి వచ్చే స్త్రీలు తమని తాము కోల్పోతూ ఉంటారు. ఒక్కోసారి తన సెల్ఫ్ ని తాము ఫీల్ అవ్వాలని అనుకున్నప్పుడు కూడా వారిలో రిలేషన్ పట్ల అసహనం ఏర్పడుతుంది. దాన్ని పోగొట్టుకోవడానికి కూడా బయట సంబంధాల్లో సంతోషాన్ని వెతుక్కోవాలని అనుకుంటారు. ఫలితంగా, తెలియకుండానే తమ పార్టనర్ ని చీట్ చేసేస్తూ ఉంటారు.
Read More:
నందమూరి కుటుంబంలో జరిగిన విషాదాలు, 11 మరణాలు ఎలా సంభవించాయంటే ?
ఈ ఫ్రేమ్ లో ఉన్న హీరో, హీరోయిన్ కాకుండా.. మరో సెలెబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా?
ఎంజీఆర్ టు దళపతి విజయ్.. తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినిమా తారలు వీరే!