Advertisement
కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సాంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, లైఫ్ పార్టనర్ తో గొడవ పడ్డాక ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
గొడవ జరిగిన తర్వాత చాలామంది తప్పు నీదే అంటూ వాదనకు దిగుతుంటారు. ఇది ఎదుటివారిని మరింత బాధిస్తుంటుంది. కాబట్టి తప్పు ఎవరిదైనా దానిని మరిచిపోయి ముందుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. గొడవకు మీ భాగస్వామే కారణం అనే వాదనను తెరపైకి తీసుకురావద్దు. దీనివల్ల గొడవ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
* తొందరపాటుతో ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. గొడవ జరగగానే ఇంటిని వదిలి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ ను మీరు మరింత దూరం చేసుకున్న వారు అవుతారు. ఎవరో ఒకరు పట్టు వీడి బంధాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నం చేయాలి. తగ్గడంలో తప్పు లేదని, అవమానం అంతకంటే కాదని భావించాలి.
Advertisement
* చాలామంది గొడవ జరిగిన తర్వాత కూడా దాని గురించే మాట్లాడుతుంటారు. అయితే ఇలా చేయకూడదు. గొడవ సర్దుమనిగిన వెంటనే ఇతర విషయాలపై దృష్టి సారించాలి. పార్ట్నర్ తో అలా సరదాగా బయటకు వెళ్లాలి.
* వీలైతే ప్రేమించండి డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, మన డార్లింగ్ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ రిలేషన్ ను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ భాగస్వామిని మరింత కొత్తగా, మరింత ఎక్కువగా ప్రేమించండి. గొడవ సమయంలో మీపై ఎంత ద్వేషమున్న ‘ఐ లవ్ యు’ అని ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వండి ఇట్టే కూల్ అయిపోతారు.