Advertisement
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయం రగులుతుంది. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత రాజకీయాలు అన్నీ మారిపోయాయి. ఈ ఎన్నికలు టీడీపీకి పెద్ద సవాల్ అనే చెప్పాలి. మరోవైపు దసరా పండుగ రోజునే పార్టీ మెనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీ లక్ష్యంగా ఫిక్స్ చేసుకుంది. అక్కడ అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారు అయినా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజా సర్వే ద్వారా నియోజకవర్గంలో పరిస్థితిపై టీడీపీ సమాచారం సేకరించింది.
Advertisement
గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు టీడీపీ హిట్ లిస్టులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా గెలవాలనే టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. అక్కడ స్థానిక పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. NRI వెనిగండ్ల రాము రావి వేంకటేశ్వరరావు మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నియోజకవర్గ పరిధిలో వర్షాల కారణంగా దెబ్బ తిన్న రైతాంగానికి తన సొంత ఖర్చుతో అండగా నిలిచారు. పార్టీ నేతలకు దగ్గర అయ్యారు.
Advertisement
వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్థానిక యువతకు సహకారం అందించారు. గుడివాడ టీడీపీ టికెట్ రాముకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందనే సమాచారంతో పార్టీ నేతలు ఆయనతోనే కొనసాగుతున్నారు. రావి పార్టీకి నష్టం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో నియోజకవర్గంలో నేతలు ఉన్నట్టు నివేదికలు అందినట్టు సమాచారం. కృష్ణా జిల్లాలో ఈసారి గుడివాడ, గన్నవరం టీడీపీ ప్రత్యేక టాస్క్ గా తీసుకుంది. ఈ రెండు నియోజకవర్గాలలో పరిస్థితుల పై ఎప్పటికప్పుడూ నివేదికలు తెప్పించుకుంటోంది.
వీటిని కూడా చదవండి : ఇది కదా కేసీఆర్ మార్క్ రాజకీయం అంటే.. ఈ దెబ్బతో ప్రత్యర్థులు గల్లంతే !