Advertisement
ఎగ్జామ్ అంటే మనకి ఎంత నాలెడ్జి ఉందొ తెలుసుకోవడానికి ఓ ప్రామాణికం లాంటిది. మనకి వచ్చిన మార్కులని పట్టి మనం ఎంత సబ్జెక్టు నేర్చుకున్నామో అంచనా వేస్తారు. కానీ, పరీక్షకి సరిగ్గా ప్రిపేర్ అవ్వనివారు ఎదో ఒక రకంగా పాస్ అయితే చాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే స్లిప్ పెట్టడాలు, ఒంటిమీద రాసుకుని వచ్చి ఎగ్జామ్ లో రాయడం, లేదా పక్కన వాళ్ళ దాన్లో చూసి కాపీ కొట్టడం చేస్తూ ఉంటారు. ఇటీవల బీహార్ లోని తిల్క మంఝి యూనివర్సిటీలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.
Advertisement
ఓ మహిళ కాపీ కొడుతూ ఉండగా వారి రూమ్ ని ఇన్విజిలేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అది గమనించాడు. వెంటనే.. ఆమె పేపర్ ను లాగేసుకున్నాడు. సాధారణంగా ఇన్విజిలేటర్లు ఎవరైనా కాపీ చేస్తూ ఉండగా చూస్తే వారు ఎగ్జామ్ ని రాయనివ్వరు. లేదా పనిష్మెంట్ ఇస్తారు. లేదా ఇంకోసారి ఇలా చేయవద్దు అంటూ వార్నింగ్ ఇస్తారు. సదరు ఇన్విజిలేటర్ ఆమెను కాపీ చేయకుండా ఆపడానికి పేపర్ లాగేసుకున్నాడు. దీనితో ఆమె ఆగ్రహించింది. వెంటనే ఆ ఇన్విజిలేటర్ చొక్కా పట్టుకుంది.
Advertisement
Kalesh b/w a Invigilator and A woman over he stopped her from cheating in Exam Bihar pic.twitter.com/nZqGS145UB
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2023
ఆమె చొక్క పట్టుకుని గుంజేయడం, అతనితో గొడవపడటం చేస్తుంటే రూమ్ లో మిగతా వారంతా ఆశ్చర్యపోయి చూసారు. ఇతర ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. ఇదంతా ఓ వీడియో లో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇదేమి చోద్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More:
క్రికెట్ లవర్స్ కి పెద్ద బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి మీరు ఆ వీడియోలు చూడలేరట!