Advertisement
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది భీకర ఫామ్ లో ఉన్నారు. 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కారు. ఈ సంవత్సరం ఇప్పటి దాకా రెండు ఫార్మాట్లలో 13 మ్యాచులు ఆడిన యశస్వి మైలురాయిని చేరుకున్నారు శ్రీలంకతో జరిగిన రెండవ T20 మ్యాచ్ లో అతను దీన్ని అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండవ T20 మ్యాచ్లో 15 బంతులు ఎదుర్కొన్న యశస్వి మూడు పోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. 30 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 740 పరుగులు చేసాడు.
Advertisement
ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్ లో చూస్తే 79.91 సగటుతో 712 పరుగులు చేశాడు. T20 లో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 283 పరుగులు చేశాడు. మొత్తంగా 13 మ్యాచ్లలో 64 సగటుతో స్కోర్ చేసాడు. రెండు సెంచరీలు అయిదు హాఫ్ సెంచరీలు ఇందులో ఉన్నాయి.
Advertisement
Also read:
ఈ ఏడాది ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ లెక్కన అతను 2000 పరుగులు పూర్తి చేసినా ఆశ్చర్యపోకర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వివరాలు చూస్తే.. యశస్వి జైస్వాల్ (భారత్) – 13 మ్యాచుల్లో 1023 పరుగులు స్కోర్ చేసాడు. కుశాల్ మెండీస్ (శ్రీలంక) – 26 మ్యాచుల్లో 888 పరుగులు స్కోర్ చేసాడు. ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్తాన్) – 25 మ్యాచుల్లో 844 పరుగులు చేసాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!