Advertisement
ఐదు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు అందరికీ కళ్ళకి కట్టినట్లు కనపడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు నీట మునగడమే కాదు ప్రజలంతా అతలాకుతలమైపోయారు. కొంతమంది ఈ నీటి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. విజయవాడలో ఈ వరద ముంపు ఎన్నో కుటుంబాల్ని చిన్నభిన్నం చేసేసింది. అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తాజాగా తీవ్ర విషాదం అందరినీ బాధ పెడుతోంది. నలుగురిని కాపాడాలని ఒక వ్యక్తి ఆశయం విధికి కూడా గిట్టనట్లు ఉంది.
Advertisement
చివరకు అతని ప్రాణాలని బలితీసుకుంది. పాలిసెట్టి చంద్రశేఖర్ 32 సింగనగర్లో డైరీ ఫార్మ్ నడుపుతున్నాడు. ఎప్పటిలానే ఆదివారం డైరీ ఫార్మ్ లో పనిచేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న టైంలో వరద ముంచెత్తింది ఒక్కసారిగా భారీవర్త పోటెత్తడంతో చంద్రశేఖర్ ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు యువకులు కొట్టుకుపోతున్నారు కళ్ళముందే సోదరులు నమ్మకంగా పనిచేసే యువకుల ప్రాణాలు పోతుంటే చంద్రశేఖర్ ఎలా అయినా కాపాడాలని వెళ్లి చనిపోయాడు.
Advertisement
Also read:
Also read:
ఆ వరదలో చాలా సాహసం చేసి ఇద్దరు సోదరులని మరో ఇద్దరి యువకుల్ని కాపాడి డైరీ ఫార్మ్ షెడ్డు పైకప్పు పైకి చేర్చాడు. తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవుల్ని రక్షించడానికి వెళ్ళాడు ఇక ఎక్కడో ఒకచోట అవి కూడా ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్ళను విప్పాడు. తర్వాత మళ్లీ డైరీ ఫార్మ్ పైకప్పు ఎక్కడానికి ప్రయత్నం చేశాడు దురదృష్టవశాత్తు విధి ఆయన పై చిన్న చూపు చూపింది. నలుగురిని కాపాడిన అతని ప్రాణాలు తీసుకుంది కాలుజారి కింద పడడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రశేఖర్ భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ కనీసం పుట్టబోయే బిడ్డని చూడలేకపోయాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!