Advertisement
దేశాన్ని నడిపించే ఏ దేశాదినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే. వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనక కదిలి వస్తుంది. అలాగే భారత ప్రధాన మంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు, అడుగడుగున ఆంక్షలు, వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద ప్రహసనం. అలా దేశాన్ని పరిపాలించే ప్రధానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అందిస్తుంటారు.
Advertisement
Advertisement
అయితే మీరు ఎప్పుడైనా ప్రధాని భద్రత సిబ్బందిని గమనించారా..? దీనికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు. దాదాపు ప్రధానికి వెయ్యి మంది కమాండోలతో కూడిన సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం ఐదు అంచెలలో భద్రతను కల్పిస్తారు. ఇందులో ఒక్కో అంచెలో ఒక్కో భద్రతా సంస్థ సెక్యూరిటీ వ్యవహారాలను చూసుకుంటుంది. అయితే ప్రధాని నడుస్తున్న సమయంలో అతనితోపాటు కొందరు అధికారులు సూట్ కేసులతో నడుస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు. అయితే సాధారణంగా ఈ సూట్ కేసులలో ఏవైనా ఆయుధాలు ఉంటాయేమోనని భావిస్తూ ఉంటాం.
కానీ అందులో ఎలాంటి వస్తువులు ఉండవు. ఆ మాటకొస్తే అది అసలు సూట్ కేసే కాదు. ప్రధాని భద్రత విషయంలో ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు..? లేదా ఎవరైనా కాల్పులకు తెగబడ్డప్పుడు ఈ వస్తువు రక్షణగా నిలుస్తుంది. స్కూట్ కేసులా కనిపించే ఈ వస్తువుని ఓపెన్ చేయగానే పెద్ద షీట్ ఓపెన్ అవుతుంది. అందులో ఓ తుపాకీ కూడా ఉంటుంది. అయితే ఇది ఓ బుల్లెట్ ప్రూఫ్ షీట్. దీని సహాయంతో ప్రధానిని లేదా మరే ఇతర ప్రముఖుల నైనా బుల్లెట్ల భారినుంచి కాపాడవచ్చు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తుంటారు.
Also Read: కమల్ హాసన్, సారికల విడాకులకు అసలు కారణం ఏంటో తెలుసా?