Advertisement
దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన విషయం మన అందరికీ తెలిసిందే. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. కృష్ణ రెండో వివాహం తర్వాత పరిస్థితి ఎలా ఉండేది? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే అంశంపై కృష్ణ మరణం పట్ల సోదరుడు ఆది శేషగిరిరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Advertisement
Also Read: భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
అప్పట్లో వీరి బంధాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, ‘కృష్ణ గారి ఇద్దరు భార్యలు ఆయనను సిన్సియర్ గా ప్రేమించారు. అందుకే వారి కుటుంబంలో ఎలాంటి కళాహాలు రాలేదు అన్నారు. కృష్ణ గారు నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరా గారు బిడ్డలను కన్నారు.
Advertisement
రెండో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణ గారు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను పేచి పెడితే పరువు తీసి పందిరేసినట్లు అవుతుందని ఇందిరా భావించేవారిని, ఆది శేషగిరిరావు తెలిపారు. ‘ఆయన తప్పేం చేశారు? ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు అనే విశాలమైన ఆలోచనలో ఇందిరాదేవి ఉండేవారు. విజయనిర్మల కూడా కృష్ణ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబం తాలూకు రిలేషన్ దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావించారు. తాను ఎంటర్ అయ్యాక కుటుంబం చిన్న భిన్నం అయిందని పేరు రాకూడదని జాగ్రత్త పడ్డారు’ అని తెలిపారు ఆది శేషగిరిరావు.
Also Read: ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!!