Advertisement
Ajith Daughters Images: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిద్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు అజిత్. ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వలిమై మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు తునివు చిత్రంతో సంక్రాంతి బరిలో విజయ్ దళపతి తో పోటీ పడుతున్నారు. ఇప్పటికే తమిళనాడులో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అజిత్ తునీవు చిత్రం ఈనెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
Advertisement
Read also: మీ లైఫ్ పాట్నర్ తో ఈ 5అబద్ధాలు చెబితే.. మీ మధ్య ప్రేమ పెరుగుతుందంట!
అయితే ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరు. ఈయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అజిత్ తన సినిమాలను కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోడు. ఇక ఫ్యామిలీ విషయాలపై ఎక్కడ స్పందించడు. అజిత్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. హీరోయిన్ శాలినీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు అజిత్. ఈయన హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ఎప్పుడు సమయాన్ని కేటాయిస్తాడు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. భార్య శాలిని, కూతురు అనుష్క, కుమారుడు అద్విక్ లతో కలిసి విదేశాలలో సందడి చేశాడు.
Advertisement
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో అజిత్ కూతురు అనుష్క స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనుష్క ఫోటోలను చూసిన నేటిజన్లు ఆమె చాలా క్యూట్ గా, అందంగా ఉందని ఆ చిన్నారికి మా దిష్టి తగలకూడదు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అనుష్క ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాలలోకి ఎంట్రీ ఇస్తుందా అంటూ ఆరాతీసే పనిలో పడ్డారు నెటిజెన్లు. ఇక మరికొందరు అభిమానులు అనుష్క సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.
Read also: బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?