Advertisement
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. హిందూ, ముస్లిం సమైక్యతను భారత దేశ సమగ్రతను చాటి చెబుతూ కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి నంది అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, షఫీ కీలక పాత్రలో కనిపించారు.
Advertisement
Read also: “అక్కినేని ఫ్యామిలీ” పేర్లకు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !
అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన సీతామాలక్ష్మి పాత్రను పోషించింది సంగీత. ఈ చిత్రంలో సంగీత రవితేజను ఇష్టపడుతుంది. అయితే సంగీత అమ్మ పాత్రలో నటించిన పావలా శ్యామల తన కూతురు సీతామాలక్ష్మి ని ఎలాగైనా హీరోయిన్ ని చేయాలనే ఉద్దేశంతో బలవంతంగా దర్శకుడు తో రూమ్ లోకి వెళుతుంది. ఆదర్శకుని ఒడిలో కూర్చొని అతనికి మధ్యాహ్నం అందిస్తుంది. అప్పుడు రవితేజ తలుపు తోసుకొని వచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు. ఆ సెటప్ మొత్తం పూలు పళ్ళతో నిండిపోయి ఉంటుంది.
Advertisement
ఈ పూలను పళ్ళను బట్టి ఓ సీనియర్ స్టార్ దర్శకుడుని కృష్ణవంశీ టార్గెట్ చేసి తీశారనే ప్రచారం జరిగింది. ఈ సీన్ లో దర్శకుడు పాత్ర పోషించిన నటుడు కూడా అచ్చం ఆ సీనియర్ దర్శకుడు గెటప్ లోనే కనిపిస్తారు. ఆ దర్శకుడు గతంలో రమ్యకృష్ణ పట్ల ఇలాగే ప్రవర్తించాడని.. అందువల్లే కృష్ణవంశీ కావాలని ఆదర్శకుడిని టార్గెట్ చేస్తూ ఖడ్గం సినిమాలో ఆ సీన్ ని పెట్టాడని తెలుస్తుంది. గతంలో రమ్యకృష్ణ సైతం ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే దర్శక, నిర్మాతల గదుల్లోకి వెళ్లాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేసింది రమ్యకృష్ణ.