Advertisement
ఈ శీతాకాలంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు. అయితే నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గ్యాస్ స్టవ్ వాడితే, మరికొంతమంది వాటర్ హీటర్ తో నీళ్లు వేడి చేసుకుంటారు. ఇంకొందరేమో గీజర్ ఉపయోగిస్తారు. ఈమధ్య చాలామంది ఇళ్లలో గీజర్ ఉపయోగిస్తున్నారు. గీజర్ ద్వారా నీళ్లు క్షణాలలో మరిగిపోతాయి. అయితే గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: రోజాకు మెగాస్టార్ కౌంటర్ పేలిపోయిందిగా… నో ఆన్సర్…!
గీజర్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మరిచిపోతే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్ లో ఉంచితే అది పేలిపోతుంది. అందువల్ల దీనిని ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అవసరమైతే అలారం పెట్టుకుని మరీ దీన్ని ఆఫ్ చేయాలి. అయితే మార్కెట్లలో ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా దొరుకుతున్నాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయడం చాలా సేఫ్. కొన్ని కొన్ని సార్లు ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే గీజర్ కొన్నా కూడా ఎప్పటికప్పుడు దానిని ఆఫ్ చేసుకోవడం మంచిది. పాత మోడల్ గీజర్ అయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేస్తుండాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తరచుగా సర్వీసింగ్, రిపేర్ కూడా చేస్తే మంచిది. అయితే యూట్యూబ్ వీడియోలు చూసి గీజర్లను ఫిట్టింగ్ చేయాలని ప్రయత్నించడం చాలా మూర్ఖత్వం.
Advertisement
ఈ విషయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోవడం తప్పనిసరి. యూట్యూబ్ లో చూస్తూ ఫిట్టింగ్ చేసినట్లయితే చిన్న పొరపాటు జరిగిన అవి షాక్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు కూడా సొంత తెలివిని ప్రదర్శించకుండా టెక్నీషియన్ ని పిలిపించడం మంచిది. ఇక మరొక విషయం ఏమిటంటే బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. గీజర్ లో ఉండే బ్యూటెన్, ప్రాపేన్ అనే గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ గ్యాస్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల ఆ గ్యాస్ ని బయటికి పంపించడానికి బాత్రూం లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవాలి.
Read also: VEERASIMHAREDDY REVIEW: ‘వీరసింహారెడ్డి’ మూవీ రివ్యూ