Advertisement
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు భార్య గానే కాకుండా మిస్ ఇండియా గా, హీరోయిన్ గా కూడా నమ్రత మనందరికీ సుపరిచితమే. ఈమె 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె సోదరీ శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. ఈమె సోదరే కాకుండా నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ నటి. ఆమె 1938లో బ్రహ్మచారి అనే సినిమాలో నటించారు.
Advertisement
Read also: HEALTH TIPS: ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?
అలా నానమ్మ వారసత్వంతో శిల్ప, నమ్రతలు హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. నమ్రత 1977లో శత్రుఘ్న సిన్హా తెరకెక్కించిన “షిరిడి కే సాయి బాబా” సినిమాలో బాలనటిగా నటించినది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కిన ” పూరబ్ కి లైలా.. పశ్చిమ్ కి చేలా” సినిమాలో నటించింది. మొదట సినిమాలలోకి రాకముందు మోడలింగ్ లోకి అడుగుపెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు హిందీ సినిమాలలో నటించి మెప్పించింది. అనంతరం మహేష్ బాబు తండ్రి కృష్ణ నటించిన వంశీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సరసన “అంజి” సినిమాతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలలోనూ నటించింది. అయితే వంశీ సినిమా సమయంలో మహేష్ – నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలున్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు, నమ్రత అలాగే గౌతమ్ కృష్ణ కూడా బాల నటుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “1 నేనొక్కడినే” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Read also: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత 10TH క్లాస్ మార్క్స్ లిస్ట్.. వామ్మో ఇన్ని తప్పులా..?