Advertisement
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోగా వెలుగొందారు సుమన్. చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలా వరుస సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయన జీవితంలో ఒక విషాదం ఏర్పడింది. దాంతో ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా ఆయన జీవితంలో జరిగిన ఓ విశాథగాధ చోటు చేసుకుంది. అదే ఆయన జైలుకు వెళ్లడం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో సుమన్ ఎదగడం చూసి ఓర్వలేక చిరంజీవి ఆయనని తొక్కేశారు అంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ విషయంలో సుమన్ స్వయంగా క్లారిటీ ఇచ్చి నన్ను చిరంజీవి తొక్కేయలేదని చెప్పారు.
Advertisement
Read also: దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?
చిరంజీవి కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆయన జైలుకు వెళ్లడానికి ఒకే ఒక కారణం ఉందట. అప్పట్లో తమిళనాడులో డిఐజిగా పని చేస్తున్న ఓ పోలీసు అధికారి కూతురు హీరో సుమన్ ని ప్రేమించిందట. అంతేకాదు ఆమెకి పెళ్లయిపోయినప్పటికీ భర్తను పట్టించుకోకుండా సుమన్ పై పిచ్చి ప్రేమ పట్టుకుందట. సుమన్ కి మాత్రం ఆమె అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదట. ఇక తన కూతురు విషయాన్ని స్వయంగా అప్పటి స్టార్ హీరో ఎంజీఆర్ దగ్గర ఆ పోలీస్ అధికారి ప్రస్తావించారట. దీన్ని గమనించిన ఎంజీఆర్ హీరో సుమన్ ని పిలిపించారట. విషయం ఏంటో తెలియకపోగా పెద్దమనిషి పిలిచారు కాబట్టి సుమన్ మాట్లాడకుండా వెళ్లారట. అప్పుడు ఎంజీఆర్.. నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావ్, మంచి నటుడివి, పైగా మనం ఇద్దరం సినిమాల్లోనే ఉన్నాం, ఆ అమ్మాయికి పెళ్లి అయింది, నువ్వు అలా చేయకు అని చెప్పారట.
Advertisement
అప్పుడు సుమన్ ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాకు ఈ జాగ్రత్త చెప్పడానికి బదులు ఆ అమ్మాయిని నా దగ్గరకు రాకుండా చూసుకోమని ఆమె తండ్రి కి చెప్పమని అన్నారట. సుమన్ చెప్పే తీరు ఎంజీఆర్ కి నచ్చక ఏదో ఒక ప్లాన్ వేసి ఆయనను బెయిల్ మీద కూడా బయటకు రాకుండా ఉండే కేసులో ఇరికించి ఆయనను రెండు నెలలు జైల్లో ఉంచారు. కానీ అదే సమయంలో సుమన్ తల్లికి అప్పుడున్న గవర్నర్ క్లాస్మేట్ కావడంతో సుమన్ తల్లి చొరవతో ఆ కేసు నుండి ఆయన బయటపడ్డారు. అంతేకాదు చివరికి డీఐజీ గారి అమ్మాయి స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన తప్పు ఏమీలేదని, చేసిందంతా తానేనని ఒప్పుకుందట. అలా ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఆయనను వదిలేశారు. ఇలా చాలా రోజుల జైలు జీవితాన్ని గడపడంతో ఆయన సినీ కెరియర్ పూర్తిగా నాశనం అయిందని.. ఈ విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సాగర్ చెప్పుకొచ్చారు.
Read also: “ఆచార్య” సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?