Advertisement
ఈ ఆధునిక యుగంలో పిల్లల పెంపకం అనేది అతి పెద్ద సవాల్. ఎవరైనా సరే పిల్లల ప్రవర్తన సరిగా లేకుంటే వెంటనే తల్లిదండ్రులను అంటుంటారు. ఎందుకంటే పిల్లలని సరైన పద్ధతిలో పెంచే బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే ముందు మీరు మంచి పౌరులుగా తయారు కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలకు తల్లిదండ్రులను మించిన రోల్ మోడల్స్ ఎవరు ఉండరు. చాలామంది తల్లిదండ్రులు తాము తమ పిల్లలకు మంచి పెంపకం అందిస్తున్నామనే భ్రమల్లో బ్రతుకుతూ పిల్లల జీవితాలతో పాటు తమ సొంత జీవితాలను కూడా ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారు. అందుకే కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధ్యత పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి కొంతమంది గాలికే వదిలేస్తుంటారు. సామాన్యుల విషయం పక్కకు పెడితే ఒక హోదాలో ఉన్న వాళ్ళు తమ పిల్లల పట్ల చాలా బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ పిల్లల పెంపకం విషయంలో బాగా దిగజారిపోతున్నారు. అందులో సురేఖ వాణి ఒకరు.
Advertisement
Read also: రంజితమే పాటలో “రష్మిక” కి మించి అదరగొట్టిన ఈ క్యూట్ భామను గుర్తుపట్టారా ?
Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె వయసు 45 ఏళ్ళు. పుట్టింది విజయవాడ, పెరిగింది హైదరాబాద్, ఉంటున్నది కూడా ఇక్కడే. ఈమెకి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ మధ్య ఈమెలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఉన్న సురేఖ వానికి ఇప్పుడున్న సురేఖ వాణికి చాలా తేడా ఉంది. అప్పట్లో పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు పద్ధతిని మర్చిపోయి తిరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చాలా సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. కొంతకాలం కిందట ఈమె భర్త మరణించగా ఆ సమయంలో సురేఖ వాణి సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా యాక్టివ్ అయింది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి, ఆమె కూతురు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కూతురికి ఉగ్గుపటే తల్లులను చూసి ఉంటారు కానీ సురేఖ మాత్రం దగ్గరుండి కూతురు నోట్లో మందు పోస్తు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం పొందుతుంటారు.
ఇంత పద్ధతి అయిన తల్లి కూతుళ్ళ పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ తల్లి కూతుర్లు ఇద్దరు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఒకరికొకరు పోటీగా అన్నట్లు తయారవుతూ ఉంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ తల్లి కూతుర్లు వెకేషన్ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సురేఖ వాణి. అందులో వీరిద్దరూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని బాగా షో చేశారు. ఇక సుప్రీత మాత్రం తన ఎద అందాలను బయటపెట్టేసింది. దీంతో కూతురు అలా ఉన్న ఫోటోలు పంచుకోవడం కరెక్టేనా అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఒక తల్లివై ఉండి కూతురిని బాగా ఎంకరేజ్ చేస్తున్నావు.. బలే పద్ధతిగా పెంచావు కదా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
Read also: అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు.