Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కెరియర్ స్టార్ట్ చేసి అందరి చేత మన్ననలు పొంది మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగుతున్నారు. చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఈయన పేరు చెప్పుకొని మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పదిమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం ఫేమస్ అవ్వాలంటే మెగా ఫ్యామిలీని తిడితే చాలు అన్నట్లు తయారైంది కొందరి వైఖరి.
Advertisement
Read also: NANDAMURI FAMILY: నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని చీకటి కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?
ఇండస్ట్రీలో ఫేమస్ కావడం కోసం తిడితే మాత్రం అవకాశాలు అయితే రావు. జనం దృష్టిలో బ్యాడ్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. అలా మెగా ఫ్యామిలీని తిట్టి ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న వారు ఎవరో తెలుసుకుందాం. ఒకప్పుడు టాప్ రైటర్ గా గుర్తింపు పొందిన చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవిని, ఆయన ఫ్యామిలీని బండబూతులు తిట్టారు. చిరంజీవి ఇంద్ర సినిమాకి చిన్నికృష్ణ రచయిత అన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవికి తాను ఇండస్ట్రీ హిట్ ఇస్తే కనీసం తనకి అన్నం కూడా పెట్టలేదని కామెంట్స్ చేశారు చిన్నికృష్ణ. అసలు చిరంజీవి ఫ్యామిలీ ఎవరికి ఏం సాయం చేయలేదని, వారు ఇండస్ట్రీలో ఎవరిని ఎదగనివ్వరు అంటూ మాట్లాడారు.
Read also: TARAKARATNA: తారకరత్న చేతులారా వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవేనా ???
Advertisement
చిన్ని కృష్ణ చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ నుండి సహాయం పొందిన చాలామంది రియాక్ట్ అయ్యారు. అలా చిన్నికృష్ణ చిరంజీవి మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలుసుకున్న చాలామంది చిన్ని కృష్ణని బాయ్ కాట్ చేశారు. ఇక శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో ఈమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇండస్ట్రీ మొత్తం శ్రీ రెడ్డిని అసలు ఒక చిన్న క్యారెక్టర్ కోసం కూడా తీసుకోవడం లేదు. ఇక కమెడియన్ గా తెలుగు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పృధ్విరాజ్ కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని తూర్పారబట్టి ఇప్పుడు అసలు తాను అప్పట్లో అలా వారి గురించి మాట్లాడలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Read also: శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
ఇక పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. అయితే పోసాని వెనకాల ఏదో రాజకీయ పార్టీ వాళ్లు చేయిస్తున్న ఆరోపణలు అని తెలుసుకున్న వాళ్ళు పోసాని గారిని కూడా సినిమాలలో పెద్దగా తీసుకోవడం లేదు. ఇలా వాళ్లని తిడితే ఫేమ్ అవుతారేమో కానీ, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది జనాలకి తెలుసు కాబట్టి అనవసరంగా మెగా ఫ్యామిలీని తిట్టడం వల్ల జనం దృష్టిలో బ్యాడ్ అవుతారు.
Read also: Telugu News, Tollywood Telugu Cinema News