Advertisement
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో తిరుగులేని తారగా వెలుగుతున్నారు. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగిందనే మాట వాస్తవం. రీసెంట్ గా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రం అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రంగంలోనే కాకుండా బాలయ్య రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నారు. నందమూరి తారకరామారావు తనయుడిగా సినిరంగ ప్రవేశం చేసి సుమారు 30 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నారు. ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1982లోనే వసుంధర దేవితో యువరత్న బాలకృష్ణకు వివాహం జరిగింది.
Advertisement
Read also: దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Advertisement
అయితే వసుంధర ఎవరి కూతురు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి వసుంధర. ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు కూడా. వసుంధర దేవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బాలకృష్ణని వివాహం చేసుకున్నారు. ఇక వీరికి బ్రాహ్మణి, తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. బ్రాహ్మణి కి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ తో వివాహం చేయగా.. తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన భరత్ కు ఇచ్చి వివాహం చేశారు. ఇక వారి కుమారుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
అయితే వసుంధర దేవికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి మాత్రమే కాకుండా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్ లో 30 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉంది. కోటికి పైగా విలువచేసే కారు ఉంది. బాలయ్య వద్ద 500 గ్రాముల బంగారం, ఐదు కిలోల వెండి ఉండగా.. ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి ఉన్నాయట. బాలయ్య ఆస్తి మొత్తం రూ. 350 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
Read also: అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?