Advertisement
మన దేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిత్యం మనం కరెన్సీ నోట్లను ఏదో ఒక అవసరానికి ఖర్చు చేస్తూనే ఉంటాం కానీ.. అసలు కరెన్సీ నోట్ల పైన చివర ఉండే గీతలను ఎప్పుడైనా పరిశీలించారా..? ఆ గీతలను బట్టి నోటు విలువ మారుతుందని తెలుసా..? అసలు ఆ గీతలతో విలువ ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి వాటి సంఖ్యను బట్టి నోటు విలువ మారుతుంది. కరెన్సీ నోట్లపై ఉన్న ఈ గీతలు నోట్ల గురించి చాలా సమాచారాన్ని అందిస్తాయి. నోట్లపై ఉండే ఈ గీతలను ‘బ్లీడ్ మార్క్స్’ అంటారు.
Advertisement
Read also: పోలీసులు విచారణ లో మరో ట్విస్ట్ ఇచ్చిన నిహారిక ! ఇంకా ఎన్ని నిజాలు దాచిపెట్టారా ?
Advertisement
ఈ బ్లీడ్ మార్క్స్ ప్రత్యేకంగా అంధుల కోసం తయారుచేస్తారు. ఈ లైన్స్ ను టచ్ చేయడం ద్వారా అది ఎంత కరెన్సీ నోట్ అనేది వారికి అర్థమవుతుంది. దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ లిపి ఎలా ఉపయోగపడుతుందో.. బ్లీడ్ మార్క్స్ అలా ఉపయోగపడతాయట. అందుకే 100, 200, 500, 2000 నోట్లపై గీతల సంఖ్యను మారుస్తూ, అలాగే వివిధ రకాల గీతలు పెట్టారట. నోట్లపై ముద్రించిన ఈ ప్రింటింగ్ ను ఏంబోస్ట్ ప్రింటింగ్ అని పిలుస్తారు. నోట్లపై వేరువేరు రూపాలలో ఈ లైన్స్ ఉంటాయి. ఇవి వాటి విలువలను సూచిస్తాయి. ఉదాహరణకి 100 రూపాయల నోటులో రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి.
అలాగే 200 రూపాయల నోటు పై రెండువైపులా నాలుగు గీతలు, ఉపరితలంపై రెండు సున్నాలు ఉంటాయి. అలాగే 500 రూపాయల నోటుపై 5 ఘాట్లు కనిపిస్తాయి. ఇక 2000 నోట్లలో రెండు వైపులా 7- 7 లైన్లు ఉంటాయి. ఈ గీతల సహాయంతో అంధులు ఈ నోటు విలువను సులభంగా గుర్తించగలరు. ఈ ప్రింటింగ్ ను INTAGLIO లేదా ఎంబోస్ట్ ప్రింటింగ్ అంటారు. ఇక 2000 నోటు వెనుక భాగంలో మంగళయాన్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. అలాగే 500 నోటుపై ఎర్రకోట, 200 నోటు వెనక భాగంలో సాంచి స్థూపం, 100 రూపాయల నోటు పై రాణి కి వావ్ చిత్రం ఉంటుంది.