Advertisement
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు కెరీర్ లో అనేక సినిమాలు వచ్చాయి. అందులో బిగ్గెస్ట్ హిట్ మూవీ భరత్ అనే నేను కూడా ఉంది. అయితే, ఈ మూవీలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టారు. ఈ డైలాగ్ సినిమా రిలీజ్ కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో సినిమాకు హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
Advertisement
Read also: మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?
భరత్ అనే నేను మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ప్రేక్షకులు అలరించారు. అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేష్ చేసే ప్రతిజ్ఞ గుర్తుంది కదా. భరత్ అనే నేను, అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది. ఆ డైలాగ్ చెప్పడానికి మహేష్ తీసుకున్న టైం ఎంతో తెలుసా. 2 గంటలు పైనే. ఎందుకు అంత టైం తీసుకున్నారు.
Advertisement
Also Read: Telugu News, Tollywood Telugu cinema News
ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేష్ ఎలా ఫీలయ్యారు, అంటే, సాధారణంగా నేతలు ప్రమాణం చేసినప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. ఇది సినిమా కనుక ఎలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్ తో రావాలి. లేదంటే పేలవంగా ఉంటుంది. అందుకనే చాలా టైం తీసుకుని ఆ డైలాగు ను చెప్పానని, ఆ తర్వాత ఎంతో గొప్పగా ఫీల్ అయ్యానని మహేష్ అప్పట్లో అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు.
Read also: గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!