Advertisement
సాధారణంగా సినీ నటీనటులు పెళ్లి చేసుకోవడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ విధంగా కోలీవుడ్ కు చెందిన అజిత్ శాలిని ఒక చిత్రంలో నటించిన సమయంలో ఇద్దరి మధ్య లవ్ ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఈ జంట అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికే వీరి వివాహమై 21 సంవత్సరాలు అవుతుంది . ఈ క్రమంలోనే వీరు విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
also read: హరీష్ శంకర్ వల్లే “పుష్ప”లో ఆ డైలాగ్ పెట్టారా..?
దీంతో ఈ జంట విడాకుల విషయంపై స్పందించింది.. విడాకులు తీసుకుంటున్నారనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల వారి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను అజిత్ తో కలిసి ఉన్న ఫోటోను శాలిని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అజిత్ శాలిని వారి పిల్లలైనా అనిష్క, అద్విత్ కూడా ఉన్నారు. పిల్లలతో ఉండడంవల్ల ఆత్మ సంతృప్తి చెందుతుందని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు అజిత్ తో దిగిన ఫోటోలో లవ్ సింబల్ జోడించి షేర్ చేశారు.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 15.03. 2023
దీంతో ఇది చూసిన అభిమానులంతా ఒక్కసారి గా ఆనందానికి గురయ్యారు. ఇందులో అజిత్ షాలిని స్టైల్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ ఫోటోలతో తాము విడిపోవడం లేదని శాలిని చెప్పకనే చెప్పినట్లు కోలీవుడ్ చెప్పుకుంటుంది.ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో తునివు సినిమాతో పలకరించారు అజిత్. ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమానే తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. ఏది ఏమైనా వీరి యొక్క విడాకుల వార్తలకు ఫోటోల ద్వారా చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.
also read:రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి