Advertisement
ప్రస్తుతం ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత దేశంలో చాలా నెలలపాటు ఈ పాట మార్మోగిపోయింది. ఈ పాటకి ఎంతో ఆదరణ లభించింది.అంతర్జాతీయంగా కూడా అత్యున్నత అవార్డు అయినా ఆస్కార్ అవార్డు రావడంతో ఇండియన్స్ అంతా ఆనందపడ్డారు. అలాంటి ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ హక్కులను ఇందిరా లహరి మ్యూజిక్ యాజమాన్యం నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Advertisement
ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు సౌత్ సినిమాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శలు కూడా చేసారు. RRR సినిమాని కాదని గుజరాత్ కి చెందిన ఛెల్లో షో సినిమాను ఆస్కార్ కి పంపడంతో కేంద్రం వైఖరీ ఏంటో స్పష్టమైందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఛెల్లో షోని కాదని ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ కి పంపించినట్టయితే భారత్ ఖాతాలో మరో అవార్డు చేరి ఉండేదని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తప్పుచేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది భారత్ నుంచి వచ్చినటువంటి బెస్ట్ 14 సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తరువాత 16 మంది సభ్యులు ఉన్న ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఓ సినిమాను భారత్ నుంచి అధికారికంగా సెలెక్ట్ చేసి ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో పంపిస్తారు. ఈ ఏడాదికి ‘ఛెల్లో షో’ ని ఎంపిక చేశారు. ఈ జాబితాలో RRR చిత్రంతో పాటు ‘కశ్మీర్ ఫైల్స్’ కూడా ఉన్నాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ‘ఛెల్లో షో’ అనే ఓ సినిమా ఉన్నదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘ఛెల్లో షో’ చిత్రం 2021లో విడుదలైంది. ఈ చిత్రాన్ని 2022, 2023 రెండుసార్లు ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ చేశారు. కానీ 2022 ఆస్కార్స్ కోసం ఛెల్లో షోని పక్కన పెట్టారు. ఈ ఏడాది భారత్ తరుపున ఆస్కార్ బరిలో ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో నిలిపారు. ఒకే సినిమాను రెండుసార్లు షార్ట్ లిస్ట్ చేయడం పట్ల పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మొత్తానికి ఛెల్లో షో కాకుండా రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి RRR చిత్రాన్ని కనుక సెలెక్ట్ చేసినట్టయితే కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చేదని పలువురు పేర్కొనడం గమనార్హం.
Read also: Telugu News, Tollywood Telugu cinema News