Advertisement
ఆహారం విషయంలో బియ్యం, గోధుమలు రెండు ముఖ్యమే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం. కానీ ప్రస్తుతం మనం తినే ఆహారమే మనకు శత్రువులా మారుతుంది. రసాయన ఎరువుల వాడకంతో ఆహారం కలుషితంగా మారుతుంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్త పోటు వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. అలాగే ఈ రోజుల్లో అధిక బరువు భయంతో చాలామంది అన్నానికి బదులు ఇతర ఆహారాలు తీసుకుంటున్నారు. ఇందులో చపాతీలు ప్రధానంగా తింటున్నారు. బరువు తగ్గడానికి, బాడీని ఫీట్ గా ఉంచడానికి రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతి తింటున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్నఫలంగా మార్చడం సరికాదంటున్నారు వైద్యులు.
Advertisement
Read also: హరీష్ శంకర్ వల్లే “పుష్ప”లో ఆ డైలాగ్ పెట్టారా..?
రాత్రిపూట పూర్తిగా అన్నం మానేసి దాని స్థానంలో చపాతీ తినే బదులు.. అన్నం తక్కువ తిని మిగతా భాగం చపాతీలు తినమని సూచిస్తున్నారు. అంతేకాదు చపాతీలలో నూనె కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గోధుమపిండిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో చపాతీలు ఎక్కువ తింటే ఒంట్లో షుగర్ స్థాయితో పాటు అన్ని పెరుగుతాయి. ఫలితంగా మనం ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చపాతీలు కాకుండా పుల్కాలు తినడం మంచిది. అవి కూడా అధికంగా కాకుండా రెండు లేదా మూడు తీసుకోవడం ఉత్తమం. అంతేకాదు ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినే చపాతీల కంటే మధ్యాహ్నం చేసుకొని రాత్రికి తినడం ఉత్తమం అంటున్నారు. చపాతీలు కానీ రోటీలు కానీ ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదట. మరి చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
* గోధుమలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
* కడుపు నిండుగా భోజనం చేసినా.. రెండు, మూడు చపాతీలు తిన్న ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి.
* చపాతిని తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. చపాతీ కంటే పుల్కాని ఎంచుకోవడం మరింత మంచిది.
* రాత్రి భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే రాత్రి సమయంలో భోజనానికి బదులు చపాతీ తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
* చపాతికి ఉపయోగించే గోధుమలలో కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా విటమిన్ బి, జింక్, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, వంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Read also: SEER FISH IN TELUGU: సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?