Advertisement
కాఫీ అనేది మంచి రిఫ్రెషింగ్ ఐటమ్. దీన్ని తాగడం వల్ల ఇన్స్టాంట్ రిలాక్సేషన్ వస్తుంది. అప్పటికప్పుడే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. తాజాగా కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారని అంటున్నారు.. మరి అది ఎలాగో చూద్దాం..
కాఫీలో ఉండే కెఫిన్ పై అనేక పరిశోధనలు జరిగాయి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. జీవక్రియను వేగంగా చేయడంలో ఈ కాఫీ బాగా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కొవ్వుని ఇట్టే కరిగిస్తుందని వారంటున్నారు.. చాలామంది అమ్మాయిల సన్నని నడుము కావాలని ఆశ పడతారు. కాఫీలోని గొప్ప గుణాలు నడుము దగ్గర కొవ్వుని త్వరగా తగ్గించి సన్నని నడుము వచ్చేలా చేస్తాయట.
Advertisement
also read: లైఫ్ పాట్నర్తో గొడవపడ్డాక ఈ తప్పులు చేస్తున్నారా.? బంధం విడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..
Advertisement
దాల్చిన చెక్క, అల్లం కాఫీ:
ఈ కాఫీ కూడా బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిపి కాఫీని తాగితే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయట. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం..
ఎస్ప్రెసో షాట్ 40మి. లీ
దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్
వెనిలా ఎక్స్ట్రాక్ట్ పావు టీ స్పూన్..
జాజికాయ పొడి పావు టీ స్పూన్
తేనె ఒక టీ స్పూన్
లో ఫ్యాట్ పాలు 120 మిల్లీగ్రాములు.
also read;ఆస్కార్ అవార్డు ని నిజంగా అమ్ముకోవచ్చా ?? ఆలా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
తయారీ:
ముందుగా ఒక కప్పులో కాఫీ పొడి అల్లం పొడిని వేయండి.
మిగతా పదార్థాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయండి. తర్వాత ఎస్ప్రెసో షాట్ వేసి బాగా కలపండి.ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపండి.
చివరికి దాల్చిన చెక్క జాజికాయ పొడి వేసి గార్నిష్ చేయండి. ఇలా చేసిన కాఫీని తాగితే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.
also read:ఎండాకాలంలో మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. సింపుల్ టిప్స్..!!