Advertisement
Konidela Niharika – Chaitanya: నిహారిక, చైతన్య జంట గురించి తెలియని వారు ఉండరు. నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా అల్లు ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Advertisement
Read also: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. అయితే ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొనిదెల ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య వ్యవహార శైలి చాలా ఆందోళనకరంగా ఉంది. నిహారిక, చైతన్య ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య నిహారికను మాత్రం అన్ ఫాలో చేయడం ఆశ్చర్యకరం.
Advertisement
అంతేకాదు తమ పెళ్ళి ఫోటోలను సైతం చైతన్య ఇన్ స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. లేకపోతే మెగా బ్రదర్ నాగ బాబునే స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. ఈ వార్తలపై స్పందిస్తారని కొంతమంది అంటున్నారు. ఇక అటు శ్రీజ దంపతులు కూడా విడాకులు తీసుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.