Advertisement
Lingashtakam Lyrics in Telugu: సాధరణంగా హిందువులతో ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో లిగాష్టకం ఒకటి. ఇందులో మొత్తం ఎనిమిది చరణాలుంటాయి. ప్రతీ చరణం కూడా పరమశివుడుని స్తుతిస్తూ రాయబడింది. ముఖ్యంగా ఈ లింగాష్టక స్తోత్రాన్ని చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా చెడు అలవాట్ల నుంచి క్రమక్రమంగా దూరమవుతారు. లింగాష్టకంకి సంబంధించిన స్తోత్రాలు మరియు దాని యొక్క తెలుగు అర్థం కింద సవివరింగా ఇచ్చాం. వీటిని చదువుకొని మనశ్శాంతిని పొందండి.
Advertisement
also read: ఆస్కార్ అవార్డు 80 కోట్లకి కొన్నారు అనే కామెంట్ కి దానయ్య దిమ్మ తిరిగే రిప్లై ! ఏమన్నారంటే ?
Lingashtakam Lyrics in Telugu: తెలుగు లింగాష్టకం..! బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజదు:ఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం
అర్థం :
ఏ లింగంను అయితే బ్రహ్మ, విష్ణు తదితర సురులు అర్పించుదురో, ఏ లింగం అయితే నిర్మలత్వమును శోభతో కూడిన ఉన్నదో, ఏ లింగం జన్మమునకు ముడిపడి ఉన్నటువంటి దు:ఖములను నశించజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్
రావదర్పవినాశన లింగం
తత్ప్రనమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగంను దేవతల యొక్క రుషుల తరతరాలు అర్పించుచున్నాయో.. ఏ లింగం కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉందో, ఏ లింగం రావణాసురుడి గర్వము నాశనం చేసిందో, అలాంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.
సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్దణ కారణ లింగమ్
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం అన్ని రకాల సుగంధములచే అద్దబడిఉన్నదో, ఏ లింగం బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగం సిద్దులు, దేవతలు, అసురుల చే వందనం చేయబడుతున్నదో అలాంటి సదా శివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.
కనకమహాణిభూషిత లింగం
ఫణిపతివేష్టిత శోభిత లింగమ్ I
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం బంగారం, గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో ఏ లింగం సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగం దక్ష యజ్ఞమును నాశనం చేసిందో, అటువంటి సదా శివ లింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.
Advertisement
also read: ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
కుంకుమచందన లేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ I
సంచిత పాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం కుంకుమ, గంధంతో అద్దబడి ఉన్నదో.. ఏ లింగం తామర పువ్వుల హారంతో అలంకరించబడి ఉన్నదో, ఏలింగం సంపాదించబడిన పాపరాశిని నాశనం చేయగలదో, అలాంటి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.
దేవ గణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ ఛ లింగమ్ I
దినకరకోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం దేవగణములచే భావంతో, భక్తితో పూజించబడుతూ సేవింపబడుతున్నదో, ఏలింగం కోటి సూర్య సమానమైన శోభతో ఉందో, అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.
అష్టదళో పరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ I
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం అయితే ఎనిమిది దళములను చుట్టూ కలిగి ఉందో, ఏ లింగం సమస్త సృష్టికి కారణమై ఉందో, ఏ లింగం ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అలాంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.
సురగురసురనరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ I
పరాత్పరం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ II
అర్థం :
ఏ లింగం అయితే సురుల గురువు అనగా బృహస్పతి మరియు ఉత్తమమైన సురులతో పూజింపబడుతున్నదో, ఏ లింగం దేవతల పూలతోటలలో ఉన్న పువ్వులతో అర్చన చేయబడుతున్నదో, ఏ లింగం ఉత్తమమైన దానికంటే ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉందో అలాంటి సదా శివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.